బస్తర్ తరాల చరిత్ర  అంతా

ప్రజా పోరుకు మారు పేరు

ఒకరి కింద బానిసలుగా

మేము వుండమ్

ఈ  అడవి మాదే  అంటూ

విస్తృత, వినూత్న   

పోరు-సమరాలు నడిపింది

ఆ వారసత్వము నుండే

నేడు

వర్గ పోరాటపు చైతన్యముతో

ఆ కాశంలో సగం – సమరంలో సగం అంటూ

దండకారణయ్య ఉద్యమంలో

సమసమాజ నిర్మాణా కర్తవ్యంతో

అడుగేసిన నూపో బుస్కీ

సాధారణ ఆదివాసి యువతి

అ ఆ లతో పాటూ-యుద్ద నీతిని నేర్చి

కమాండర్ గా నాయకత్వంలోకి

ఎదిగివచ్చిన విప్లవ వీరాంగణ

సల్వజుడుమ్,`సమాధాన్’ సామూహిక

సమరాల్లో సహసంగా పోరాడిన  ధీశాలి

ఫాసిష్టు  ఆపరేషన్ `కగార్`బాంబుదాడుల్లో

కన్ను కోల్పోయినా ధృఢ సంకల్పంతో

రణరంగంలో నిల్చింది .

బస్తర్  పోరుకు ప్రతీకగా మరోసారి

ప్రజాయుద్దంలో శత్రువు తూటాలకు

జవాబు ఇస్తూ ఆఖరి వరకు పోరాడుతూ

బోలిష్విక్  స్పీరిట్ – వర్గ పోరాటా స్పూర్తితో

విముక్తి మార్గపు వియ్యుక్కగా

నిల్చిన వీరనారి  కామ్రేడ్ బుస్కీ …..

Leave a Reply