అప్పటి వరకు
ఆమె భుజాల మీద ఏ బాధ్యత కూర్చుండ వచ్చునో

భూమి కన్నీళ్ళు తుడుస్తూనో
అడవి వీపు నిమురుతూనో
కాల్పుల్లో అనాదైన ఆదివాసీ చిన్నారి
ఆకలి కడుపు తీడుతూనో

ఏ దుఃఖం
ఆమె కాళ్ళను చుట్టుకొని ఉంటుందో

అడవిలో
రాలి పడిన నెత్తుటి జెండాల్నేరుతూనో
కాల్పుల్లో కూలిన శిరస్త్రాణాల గుండె కత్తుకుంటూనో
విరిగి పడిన ఆయుధాల ఆనవాళ్ళు కుప్పేస్తూనో

లొంగుబాటులల్లనో అరెస్టులల్లనో కనిపించని’రూపి’
ఏ ఆర్తి అమ్మలా కమ్ముకొని
ఆమెను అడవికి కట్టేసుకోనుంటుందో

కొంత ఫాసిజంఊడలైన సహచరత్వం నడుమ
కొంత ఆశయాలు పారి పోయిన మనుషుల నడుమ
కొంత పిరికితనం పొగచూరిన అడుగుల మధ్య

ఎర్రజెండా రెపరెపలాడ్తూ
ఆమెను ఏ దృశ్యం నిలబెట్టి ఉంటుందో !

అమ్మకలల్నో నాన్న కలల్నో
కొంచెం ఊపిరి పీల్చి
ఆశల చెట్టు ఆకుల్లా పచ్చదనంతో
దుఃఖిత భారత చెమట చుక్కల కళ్ళకు

తెలంగాణ సాయుధ వారసత్వ
నెత్తుటి ప్రకటన చేసింది

Leave a Reply