భారతదేశంలో అమరులైన సిపిఐ (మావోయిస్ట్) పార్టీ ప్రధాన కార్యదర్శి బసవరాజు, ఇతర ప్రజా పోరాట యోధులకు మావోయిస్ట్ ఖైదీ హుసేన్ ఉజుందాగ్ ఒక కవితను అంకితమిచ్చారు.
హుసేన్ ఉజుందాగ్ టర్కీలోని మావోయిస్ట్ ఉద్యమానికి చెందిన రాజకీయ ఖైదీ. తాజా నివేదికల ప్రకారం, ఆయన 2002 నుండి జైలులో ఉన్నారు. ప్రస్తుతం టర్కీలోని టెకిర్దాగ్ నం.1 ఎఫ్-టైప్ అత్యంత భద్రత కలిగిన జైలులో నిర్బంధంలో ఉన్నారు.
ఈ కవితలో ఉజుందాగ్ 2025 మే 21న తమ 27 మంది సహచరులతో కలిసి అమరులైన సిపిఐ (మావోయిస్ట్) ప్రధాన కార్యదర్శి బసవరాజ్; 2025 నవంబర్ 18న అమరులైన పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ కమాండర్ హిడ్మా ; 2025 మార్చి 31న అమరులైన సిపిఐ (మావోయిస్ట్) సభ్యురాలు రేణుక లకు నివాళులర్పించారు. తద్వారా, రివిజనిస్టు ధోరణికి వ్యతిరేకంగా నిలిచే ఈ ముగ్గురు ప్రతీకలుగా భారతదేశంలో సాగుతున్న ‘ప్రజా యుద్ధం’ ఒక కవితాత్మక రూపం దాల్చుతుంది.
ఈ కవిత “గుండెకోట పులులకు వీడ్కోలు/దాదాకు”; “ఆదివాసీల తిరుగుబాటు బిడ్డలకు” అనే శీర్షికల కింద 14 భాగాలుగా ఉన్నది. దీనిని తెలుగులోకి ఫెలో ట్రావెలర్ అనువదించారు. ఈ కవిత్వాన్ని తెలుగు పాఠకుల కోసం బుక్ రూపంలో అందుబాటులో ఉంచాము. పాఠకులు డౌన్లోడ్ చేసుకుని చదువుకోగలరు.
- వసంతమేఘం సంపాదకవర్గం




