నాట్యం నేర్చిన 
నెమలి ఆటను
ఆపదు యే నిర్బంధం
రక్తం కారినా
రగులుతు మళ్లీ
చేస్తుంది పోరాటం

పాట నేర్చిన కోయిల
రాగం ఆగదు
అడ్డొచ్చె
కొండకోనలను కోసుకు వెళ్తూ
సాగే ఏరే
ప్రవాహమవును
రణనినాదమై గమ్యం చేరును

Leave a Reply