వ్యాసాలు

వేగుచుక్క

అల్లూరి సీతారామరాజు (4-7-1897 : 7-5-1924) భారత స్వాతంత్ర్య పోరాటంలో వేగుచుక్క అల్లూరి సీతారామరాజు, ఆదివాసుల గుండెల్లో ఆరని జ్యోతి అల్లూరి సీతారామరాజు. అలనాటి తెల్ల ప్రభుత్వానికి సింహస్వప్నం అల్లూరి సీతారామరాజు, అందుకే తెలుగునాట తొలి బూటకపు ఎన్ కౌంటర్ సీతారామరాజుది. నేలతల్లి బిడ్డల విముక్తి కోసం నేలకొరిగిన వీరుడు సీతారామరాజు, అయినా చావులేని సమరశీలి సీతారామరాజు. ఇంతకీ సీతారామరాజు జీవితకాలం కేవలం ఇరవై ఏడేళ్ళు. కాని అల్లూరి ఊసులు, వాసనలు నూరేళ్ళయినా మాసిపోలేదు, మాయం కాలేదు. ఎందుకని ? అప్పుడు నా చిన్నప్పుడు రెండో ప్రపంచయుద్ధం ముమ్మరంగా జరుగుతున్నప్పుడు నాజీలు నరజాతిని నెత్తురు టేరుల్లో ముంచెత్తు తున్నప్పుడు
పరిచయం

చరిత్రలో పాక హనుమంతు

ఈ మధ్యే అమరుడైన పాక హనుమంతు (గణేష్) స్మరణలో విప్లవోద్యమ సానుభూతిపరులు, మద్దతుదారులు ఆయన అమరత్వాన్ని స్మరిస్తూ, శ్లాఘిస్తూ చాలా దుఃఖంతో రాసిన వ్యాసాలివి. గతంలో కూడా అమరుల గురించి రచనలు వచ్చాయి. ఈ అమరత్వానికి ఒక ప్రత్యేకత ఉంది. విప్లవోద్యమం తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటున్న దశలో హనుమంతు అసువులు బాశాడు. రాజ్యాంగాన్ని, చట్టబద్ధ ప్రమాణాలను పూర్తిగా విస్మరించి బాహాటంగా ఒక తిథి నిర్ణయించి, ఆ తిథి లోపల ఉద్యమాన్ని రూపు మాపుతామని రాజ్యం  ప్రకటించింది. ఆ నేపథ్యంలోనే సాయుధ బలగాలకు పూర్తి అధికార మిచ్చి వందల సంఖ్యలో విప్లవకారులను హత్య చేసింది. ఆ నేపథ్యంలో పాక హనుమంతు
వ్యాసాలు

లందలో పొడిచిన రాడికల్ సూర్యుడు “కర్రెం నర్సప్ప”

నల్లమల విప్లవోద్యమం ఏమి మిగిల్చుకోలేదని అది ఒక పరాజిత గాథ అని మాట్లాడే మేధావులు చాలా మందే ఉన్నారు సమాజంలో. నిజానికి నల్లమల ఉద్యమం ఏమి మిగిల్చుకోలేదా! సమాజం మీద ఎలాంటి ప్రభావాన్ని చూపలేదా?అది ఓడిపోయిన కథ మాత్రమేనా? ఎందుకని సో కాల్డ్ మేధావులకు ఈ వివక్ష? ఉత్తర తెలంగాణ,విప్లవోద్యమాన్ని రొమాంటిక్ గా గంటలు గంటలు ఎత్తిపాడుతూ, ఉపన్యాసాలు దంచే వారికి నల్లమల్ల విప్లవోద్యమం ఎందుకని చిన్నగా కనిపిస్తుందో వింతగా తోస్తుంది. బహుశా నేను అనుకుంటాను నల్లమల్ల విప్లవోద్యమంలో మొదటి తరాన్ని మినహాయిస్తే ఆ విప్లవోద్యమం సెట్ బ్యాక్ గురయ్యేవరకు దళితుల ముఖ్యంగా మాల మాదిగల కొందరు బీసీల
కొత్త పుస్తకం

ఆజాద్‍కు అశ్రునివాళిగా…

ఈ ఏడాది విప్లవ వీరుడు చంద్రశేఖర్ ఆజాద్ 120వ జయంతి.  ఆయన శత జయంతి (జూలై 23, 2006)ని పురస్కరించుకుని పుస్తకం తీసుకురావాలని నిర్మలానంద  ప్రయత్నించారు. పుస్తకం వెలువరించకుండానే  వెళ్ళిపోయారు. ఆ బాధ్యతను ఇప్పుడు భుజానికి ఎత్తుకున్నాం. ఇందులో ప్రచురించిన వ్యాసాల్లో కొన్ని తెలుగు మాస, దిన పత్రికల్లో వచ్చినవే.  రకరకాల కారణాల వల్ల పుస్తక రూపంలో రావడానికి 20 ఏళ్లు పట్టింది. 1970ల నుంచే భారతీయ విప్లవకారుల గురించి వ్యాసాలు, పుస్తకాలు సేకరించే అలవాటున్న నిర్మలానందగారికి, చంద్రశేఖర్ ఆజాద్ వివరాల సేకరణకు చాలా ఏళ్లు పట్టింది. బహుశా ఆజాద్ అజ్ఞాత జీవితమే అందుకు కారణం. మన మధ్య
కవిత్వం

హం హోంగే కామ్యాబ్

వాగ్దానాలు ప్రతి సీజన్ కు పూసే కొత్తపూలువాసనలేని, మనిషి వూసులేని పాలనలునిజమిదన్న వాండ్లను ‘ఇజ’మిదనిలెక్కలుగట్టి జైల్లో మూటగడుతుంటరుపాతచరిత్రను మళ్ళీమళ్ళీ తొడుక్కునే భక్తికాలాన్ని వెనక్కితిప్పి ప్రగతి అనే రక్తిదేశమంటే ప్రజలని మరిచిన ఆయుధంప్రజలబాధలు కంటికి ఆనని రాజ్యంప్రజలు గుమిగూడి మాట్లాడుకుంటరుప్రజలు ప్రజల గురించే మాట్లాడుతుంటరురాజ్యం పాలకుల భోజ్యమన్న పాతసామెతనుతిరిగేసి ప్రజావీరులదే ప్రభుత అంటుంటరుఊర్లల్ల నుంచి పట్నాలదాకబాటవట్టిన కార్పోరేట్లను చర్చిస్తరుఅడ్డందిరిగి గల్లంతయిన అడ్రసులు వెతుకుతుంటరు జంజంబల్ బరీ అని పాటలు పాడుతుంటరుకాని, ఒకటేమిటి వందలసార్లు గుమికూడుతుంటరువొడువని బాధల్ని వొడిసే గొంతులైతుంటరుప్రశ్నిస్తూనే సాగుతుంది ప్రజాయుద్ధంగాయపడ్తూనే... ఎప్పటికప్పుడు సన్నద్ధం
కవిత్వం

దిక్సూచి

కవులు, రచయితలు లేని నేల ఎవరైనా చూడగలరా?ఆలోచనలు అంకురించని ఖాళీ జాగా ఎక్కడైనా ఉందా?మనుషులు కలుసుకోని సమాజాలున్నాయా?అభయహస్తాన్నందించే పాలకుల భయాలేమిటి మరి?ప్రతి విప్లవ కవీ ప్రజలకు ఆప్తుడేవాళ్ళ ప్రతి అక్షరమూ ప్రజల గుండె చప్పుడే!సమాజ దిక్సూచిగా కొన్ని కలాలు కవాతు చేస్తూనే ఉంటాయ్ప్రశ్నల వర్షాలై ప్రజల మెదళ్ళు పరవళ్ళు తొక్కుతూనే ఉంటాయ్...
కవిత్వం

ఆటను ఆపలేని యుద్ధం

శిథిలాల మధ్యఇనుప ధూళితో నిండిన గాలిలోపేలుళ్ల ప్రతిధ్వనులను ఊయల పాటలుగా మార్చుకుంటూఒక చిన్నారి నవ్వింది.ఆ నవ్వుఏ సామ్రాజ్యపు ఫిరంగికీ వినిపించలేదుకానీభూమి గుండెల్లో మాత్రంఒక కొత్త విత్తనంలా మొలిచింది.ఇల్లు లేదుకానీ ఆకాశం ఉంది.బడి లేదుకానీ అక్షరాలను వెతికే కళ్ళు ఉన్నాయి.బొమ్మలు లేవుకానీ రాళ్లతో రాజమందిరాలు కట్టే ఊహ ఉంది.ఊయల విరిగిపోయిందికానీరెండు తాళ్లను మళ్లీ కట్టిగాలిని ఊపే చేతులు ఇంకా ఉన్నాయి.యుద్ధంముందుగా ఇళ్లను చంపుతుంది.తర్వాతఆసుపత్రులను.తర్వాతపాఠశాలలను.చివరికిపిల్లల కలలను.కానీఒక విషయం మాత్రంఅది ఎప్పుడూ పూర్తిగా చంపలేకపోయిందిఆడుకోవాలనే బాల్యం.చూడండి…దుమ్ముతో నిండిన ముఖంపైఇంకా నవ్వు ఉంది.గాయపడిన మోకాలిపైఇంకా పరుగుంది.ఆకలితో వణుకుతున్న శరీరంలోఇంకా స్నేహితుడిని పిలిచే స్వరం ఉంది.అదిమానవ జాతికిచివరి పాఠం.“నన్ను చంపవచ్చునా బాల్యాన్ని కాదు”అనిప్రతి ఊయల చెబుతోంది.శిథిలాలపైఒక
కవిత్వం

ప్రవాహం

నాట్యం నేర్చిన నెమలి ఆటను ఆపదు యే నిర్బంధంరక్తం కారినా రగులుతు మళ్లీ చేస్తుంది పోరాటం పాట నేర్చిన కోయిల రాగం ఆగదు అడ్డొచ్చె కొండకోనలను కోసుకు వెళ్తూ సాగే ఏరే ప్రవాహమవునురణనినాదమై గమ్యం చేరును
కవిత్వం

మనుషులం కదా

మనుషులం కదాఆలోచనలనువిరమించుకోలేం కదాఇంత నాగరికతా పెరిగిందిప్రశ్నలకు జవాబులవెతుకులాటలోనే కదాదేశమంతా పీడిస్తున్నఈ ఉక్కపోతకుకారణాన్ని ప్రశ్నించడంనేరంగా మారుతూందినలుగురు కూడి మాటాడుకోవడం దేశద్రోహమవుతుంది మనుషుల మధ్య వారి మనసుల మధ్య చిచ్చు పెట్టడమే నేటి పాలనా తీరు గోవును పూజిస్తారు మనిషిని ముక్కలుగా నరికీ చంపుతారు మనుషుల మధ్య మనువును అడ్డంగా నిలబెడతారు న్యాయమూర్తులు ధర్మం బోధిస్తారు న్యాయన్ని ఉరితీస్తారు ఈ నిర్భంధ శిబిరంలో మౌనంగా తలదించి బతకడం ప్రజా ద్రోహం మనుషులం కదా మరల నడచి వచ్చిన రహదారి కూడలిలో మరల కలుసుకుందాం!!
కథలు

“రా”

ఆగస్టు నెలలోని ఆ ఉదయం ఎప్పటిలాగే చాలా సాధారణంగా ప్రారంభమైంది. హైదరాబాద్‌లోని ఆయన ఇంట్లో దశాబ్దాల నాటి పాత పుస్తకాల వాసన, వంటగది నుండి వస్తున్న వేడి ఫిల్టర్ కాఫీ సువాసనతో కలిసిపోయి ఒక అదృశ్యమైన పొగమంచులా గదిలో తేలియాడుతోంది. రావు తన పాత కుర్చీలో కూర్చుని దినపత్రిక చదువుతున్నారు. ఎనభై ఏళ్ల వయసు ఆయన ముఖంలో, గీతల రూపంలో గీసిన మ్యాపులా స్పష్టంగా కనిపిస్తోంది. చేతులు కొద్దిగా వణుకుతున్నాయి, అది కాలం ఆయన శరీరానికి బహుమతిగా ఇచ్చిన పార్కిన్సన్స్. బయట రోడ్డు మీద పాలు అమ్మేవాడి సైకిల్ బెల్ మోగింది. అంతా ప్రశాంతంగా, నిశ్శబ్దంగా ఉంది. ఆ