కవిత్వం

ఎక్కడివీ స్వేచ్ఛా వాయువులు

వాళ్లు ఈచోటచివరి శ్వాసను విడిచారు ఎన్నడూచూడబోని భవిష్యత్తు కోసం భారీ మూల్యమే చెల్లించారు చేతులకు సంకెళ్లతో ఆగ్ని గుండాల గుండా నడిచారు వాళ్ళు కానీ మాతృభూమి కోసం నిరంతర తపన ఉండేది తుపాకులు కెదురీదారు జైళ్లను ఆహ్వానించారు కానీ ఏనాడు వెనుదీరిగింది లేదు తమ పిల్లల భవిష్యత్తు కోసం త్యాగాలకు వెరిసింది లేదు వాళ్ళ చివరి శ్వాసలకు కాసిన స్వాతంత్ర ఫలాలను మనం అనుభవిస్తున్నాం వాళ్ళు కలలు కన్న జీవితాన్నిమనం జీవిస్తున్నాంతమ రక్తంతోతమ పోరాటంతో తమ బాధలతో తమనష్టాలతో వాళ్లొక జ్వాలను వెలిగించారు ఈ సంకెలా వాళ్లను ఆపలేదు
ఆర్ధికం

నిప్పుల కొలిమిగా యూరప్

ఇవాళ యూరప్ నిప్పుల కొలిమిగా మారింది. చరిత్రలోనే అత్యంత తీవ్రమైన, సుదీర్ఘమైన హీట్‌వేవ్  (వడగాల్పులు) కోరల్లో చిక్కుకొని అల్లాడిపోతున్నది. కార్బన్ కాలుష్యం కారణంగా మరింత కోరలు చాచిన ఈ వేడి..  ప్రభుత్వాలు ముందు జాగ్రత్తలు తీసుకోకపోవటంతో ప్రజలను కష్టాల పాలు  చేస్తున్నది. ఫ్రాన్స్ చరిత్రలోనే అత్యంత వేడి రాత్రిని నమోదు చేయగా..,  బ్రిటన్, స్విట్జర్లాండ్ దేశాలు జూన్ నెలలో ఆల్-టైమ్ రికార్డు ఉష్ణోగ్రతలు చ‌వి చూశాయి. ఎండ వేడికి పలుచోట్ల కాంక్రీట్ స్లాబ్‌లు పగుళ్లు పడుతున్నాయి. రైల్వే పట్టాలు క‌రిగిపోయి దెబ్బతినడం.. రోడ్లు బీటలు బారడంతో ప్రజా రవాణా స్తంభించిపోయింది. ఎండలతో యూరప్ దేశాలలో 6000  మందికి పైగా
వ్యాసాలు

అల్లూరి సీతారామరాజు సాయుధ పోరాటం

ఆధునిక యుగంలో ఆంధ్ర దేశానికే గాక తక్కిన ప్రాంతాలకు గూడా అల్లూరి సీతారామరాజు పోరాటం రాజకీయ ప్రాముఖ్యం గల విషయం. దాన్ని సాకల్యంగా సమీక్షించుకొని గుణపాఠాలను స్మరించు కోవలసిన అవసరం ఎంతైనా ఉంది. గాంధీ శకం శాసనోల్లంఘన, సహాయ నిరాకరణ ఉద్యమాలతో ప్రారంభమై, ఒక ఉప్పెన పొంగిన కొద్దికాలానికే చౌరీచౌరా ఘటనతో వాటిని ఉపసంహరించడం జరిగింది. 1922 మార్చిలో గాంధీ బందీ అయ్యాడు. మరొక ఐదారు మాసాలలోనే సీతారామరాజు పోరాట పతాకం ఎత్తాడు. తెలుగుదేశానికి సంబంధించి పల్నాటి పుల్లరి సత్యాగ్రహం, పెదనందిపాడు పన్నుల నిరాకరణ పోరాటం, చీరాల-పేరాల మునిసిపాలిటీ వ్యతిరేక పోరాటం, మధ్యతరగతి ప్రజల వరకైనా జాతీయ స్వాతంత్ర్య
కరపత్రాలు

మీ జ్ఞాపకాలతో జీవిస్తాం, మీ ఆలోచనలతో ముందుకుపోతాం

అమరుల బంధుమిత్రుల సంఘం 24 ఆవిర్భావ సభ జూలై 18 శనివారం మధ్యాహ్నం 2 గంటలకు, సుందరయ్య విజ్ఞాన కేంద్రం కాట్రగడ్డ హాలు, హైదరాబాదు జీవితంలో ఆనందాలను మర్చిపోగలమేమోగాని దు:ఖాలు ఎన్నటికీ దూరం కావు. కష్టాలన్నిటిలోకి కళ్ల ముందు మరణాలు తీరని విషాదంగా మిగిలిపోతాయి. కన్నవాళ్ల ముందే బిడ్డలు మరణించడం, జీవితమంతా కలిసి ఉంటారనుకున్న సహచరులు అర్ధాంతరంగా వెళ్లిపోవడం, తల్లిదండ్రులెవరో తెలియని బాల్యాన్ని గడపడం, తోడబుట్టిన వాళ్ల కోసం ఏండ్ల తరబడి నిరీక్షించి చివరికి మృతదేహాన్ని చూడాల్సి రావడం, ఇంకొందరి చివరిచూపు కూడా దక్కకపోవడం జీవితాంతం కలచివేస్తూనే ఉంటుంది. మానిపోని ఆ గాయాన్ని మోసుకు తిరగడం దుర్భరంగా ఉంటుంది.
నివాళి

అరుణోదయ నాగన్నకు విప్లవ జోహార్లు

అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య వ్యవస్థాపక సభ్యుడు కామ్రేడ్ పరకాల నాగన్న శుక్ర‌వారం (03-06-2026)అనారోగ్యంతో ఖమ్మంలో మ‌ర‌ణించారు. ఈ దేశ ప్ర‌జ‌ల విముక్తి కోసం సుదీర్ఘ‌కాలంపాటు ఆడి, పాడి తుది శ్వాస వ‌ర‌కు పోరాడే ప్ర‌జ‌ల ప‌క్షానే నిలిచిన నాగ‌న్న‌కు విర‌సం జోహార్లు అర్పిస్తోంది. శ్రీపాద శ్రీహరి అమరత్వంతో ఎరుపెక్కిన ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం రాజారాం గ్రామంలో నాగ‌న్న జ‌న్మించారు. శ్రీ‌హ‌రి స్ఫూర్తితో గజ్జె కట్టి గళం ఎత్తి బయల్దేరిన పాలబుగ్గల పసివాడు పరకాల నాగయ్య నుండి అరుణోదయ నాగన్నగా రాజకీయ పరివర్తన చెంది ప్రజల గుండెల్లో చెరగని ముద్రవేశారు. ఆయ‌నది నిరుపేద గీత కార్మిక కుటుంబం. బాల్యం
గెస్ట్ ఎడిటోరియల్

భారతదేశంలో ఫాసిజం : ప్రత్యేకతలు

చీకటిలో చూపు నిశితమవుతుంది. నిశ్శబ్దంలో మాట పదునెక్కుతుంది. దురాక్రమణలో స్వేచ్ఛాకాంక్ష అణువణువునా విస్తరిస్తుంది. మానవత రద్దయ్యే భీకర సన్నివేశంలోకి ఊహించని వైపుల నుంచి లక్షల, కోట్ల గొంతుకల జీవన గీతం పోటెత్తుతుంది. ఇప్పుడు దేశం దేశమంతా దుఃఖాన్ని, ధైర్యాన్ని ఒకే ఒక స్వరంతో పాడుతోంది. ఫాసిజం ఎట్లా ఉంటుందో, దాని వికటాట్టహాసం ఎంత క్రౌర్యంగా ఉంటుందో మనకు ఎన్నడో అనుభవంలోకి వచ్చింది. ఫాసిజం మనలోని రాజకీయశక్తినీ, నైతికశక్తినీ కుప్పకూల్చాలనుకుంటుంది. మాట్లాడే మనుషులు లేకుండా తుడిచిపెట్టేయాలనుకుంటుంది. కానీ పెట్టుబడిదారీ విధానంలాగే ఫాసిజం కూడా తన ప్రత్యర్థిని వెంటేసుకొని పుడుతుంది. ఇవాళ అదే చూస్తున్నాం. గెలుపు ఓటముల మధ్యనే, అణచివేత ధిక్కారాల
పత్రికా ప్రకటనలు

పి.ఓ.కె. లోని ఫాసిస్ట్ పాకిస్తానీ ప్రభుత్వ క్రూరమైన అణచివేతను ఖండిస్తున్నాం

పాకిస్తానీ ఆక్రమిత కశ్మీర్‌లో జరుగుతున్న ఒక భారీ నిరసన ఉద్యమంపైన 2026 జూన్ 8నాడు పాకిస్తానీ సైన్యం క్రూరమైన అణచివేతకు పాల్పడింది. ఈ ఘటనలో కనీసం 27 మంది మరణించగా, 200 మందికి పైగా గాయపడ్డారు. ఇటీవల నిషేధించబడిన జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (జెఎఎసి) మద్దతుతో జరిగిన ఈ నిరసనలు, ఆకాశాన్నంటుతున్న పిండి ధరలు, పెరుగుతున్న విద్యుత్ ఖర్చులు, తీవ్రమవుతున్న ప్రభుత్వ అణచివేత, సామాజిక, రాజకీయ, ఆర్థిక హక్కులను నిరంతరం నిరాకరించడానికి నిరసనగా వెలుగులోకి వచ్చాయి. రాబోయే ఎన్నికలలో శరణార్థుల కోసం కేటాయించిన 12 రిజర్వ్ సీట్లను రద్దు చేయాలని కూడా నిరసనకారులు డిమాండ్ చేశారు. ఈ
వ్యాసాలు

ప్రైవేటు విద్యా వ్యాపార సంస్థలు, ప్రభుత్వ వ్యవస్థల కుమ్మక్కు.

రాష్ట్రంలో నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో జూన్ 15 వ తేదిన పాఠశాలలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి ప్రత్యేకంగా లేకపోవడం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే విద్యాశాఖ మంత్రిగా ఉండటంతో విద్యశాఖపై పర్యవేక్షణ కరువైంది. ఇదే అదనుగా ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు  నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరలకు పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, యూనిఫాం, ఇతర వస్తువుల అమ్మకం యదేచ్ఛగా సాగిస్తున్నారు. వీటితో పాటు పాఠశాలల అనుమతులకు సంబంధించిన(ఎన్వోసి) నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ జారీ, బస్సుల పిట్నేష్ సర్టిఫికెట్, పైర్ సేఫ్టీ సర్టిఫికెట్ లు పొందుటకు ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు లక్షల రూపాయలు ఖర్చు పెడుతూ రాజకీయ