వ్యాసాలు

జీరంఘాటీ మరణశిక్షలను రద్దు చేయాలి

జీరం ఘాటీ ఆదివాసీల మరణశిక్ష,సీల్ధా ఆదివాసీల జీవిత ఖైదు శిక్షలను రద్దు చేయాలి.  అన్ని జైళ్ళలోని రాజకీయ ఖైదీలందరినీ విడుదల చేయాలి. 2013 సంవత్సరం,ఛత్తీస్ ఘడ్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు చేసిన దాడిలో సల్వాజుడుం నేతతో సహా 29 మంది కాంగ్రెస్ నాయకుల మరణానికి కారకులంటూ ఈ దాడితో ఏ విధమైన సంబంధం లేని పది మంది ఆదివాసీ దోషులకు జగదల్ పూర్ లోని ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు సెప్టెంబర్ 16 న మరణ శిక్షను ఖరారు చేసింది.వీరిలో ఒకరు ఇంతకుముందే మరణించారు. మిగిలిన వారు హైకోర్టుకు అప్పీలు చెసుకునే అవకాశం ఉన్నా ఇప్పటికే 13 సంవత్సరాల జైలు
వ్యాసాలు

విప్లవ నాయకుడు కా.బాలకృష్ణకు జోహార్లు!

ఈ నెల 11 కు కా. మోడెం బాలకృష్ణ అమరుడై ఏడాది అయ్యింది. 2025 సెప్టెంబర్ 11 న ఛత్తీస్ గఢ్ రాష్ట్రం లోని గరియాబంధ్ జిల్లాలోని రాజాదేరా అడవిలో ఉన్న విప్లవకారుల బృందం గురించి సమాచారం తెలిసిన పోలీసులు పెద్ద ఎత్తున చుట్టుముట్టి చేసిన దాడిలో సి‌పి‌ఐ (మావోయిస్టు) కేంద్రకమిటీ సభ్యుడైన కా. బాలకృష్ణతో పాటు, కా. చంద్రహాస్ (పాండు), మరో ఎనిమిది మంది కామ్రేడ్స్ అమరులయ్యారు. 2024 లో మొదలైన ఆపరేషన్ కగార్ లో ఈ గొప్ప విప్లవకారులు కూడా తమ ప్రాణాలు అర్పించారు.కా. బాలకృష్ణ తన 61 ఏళ్ల జీవితంలో 44 ఏళ్ళు విప్లవానికే
పత్రికా ప్రకటనలు

జీరమ్‌ ఘాటిలో 10 మంది,సిల్డా 23ల శిక్షలను రద్దు చేసి,వారిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూఅంతర్జాతీయ సంయుక్త ప్రకటన

"గణతంత్రం తన సొంత బిడ్డలను చంపడాన్ని మేము అనుమతించలేము" జీరమ్‌ఘాటిలో 10 మందికి విధించిన మరణశిక్షలను రద్దు చేయాలి సిల్డా లో 23 మందికి విధించిన యావజ్జీవ కారాగార శిక్షలను రద్దు చేయాలి రాజకీయ ఖైదీలందరినీ విడుదల చేయాలి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రగతిశీల, ప్రజాస్వామ్య, మానవ హక్కుల సంస్థలకు విజ్ఞప్తి ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్‌పూర్‌లో ఉన్న ప్రత్యేక జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ ఐ ఏ) కోర్టు, 2013 జీరమ్‌ ఘాటి దాడి కేసులో పది మంది మావోయిస్టులు, ఆదివాసీ వ్యక్తులకు విధించిన మరణశిక్షలను మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. ఈ ఘటన జరిగిన పదమూడు సంవత్సరాల తర్వాత, ప్రమీలా మోడియం,
పత్రికా ప్రకటనలు

మనమంతా కలిసి అంతటా ఉరిశిక్షను రద్దు చేయించగలం

మరణశిక్ష అనేది ప్రాథమిక జీవించే హక్కును ఉల్లంఘించడమే కాకుండా, అత్యంత క్రూర, అమానుష, అవమానకరమైనది. నిందితుడు ఎవరైనా, నేర స్వభావం ఎలాంటిదైనా, వారు దోషులైనా లేదా నిర్దోషులైనా—మినహాయింపు లేకుండా అన్ని కేసులలోనూ మరణశిక్షను వ్యతిరేకిస్తాం. మరణశిక్ష పద్ధతులు అన్నీ అమానుషమైనవి, ఆమోదయోగ్యం కానివి. మరణశిక్షను పూర్తిగా రద్దు చేయాలనేదే మా వాదన. ఇతర రకాల శిక్షలు వేసినప్పటి కంటే మరణశిక్ష వేయడం వల్ల ఎక్కువగా నేరాలను నివారించలేదు అని ప్రపంచవ్యాప్తంగా జరిగిన పరిశోధనలు నిరూపించాయి. చాలా తరచుగా, ఇది ప్రభుత్వ నియంత్రణకు ఒక ఆయుధంగా ఉపయోగపడుతుంది; పాలకుల అపరిమిత అధికారాలను విస్తరించడమూ; రాజ్య వ్యతిరేకతను అణచివేయడమూ దీని ఉద్దేశ్యం.
వ్యాసాలు

ప్రపంచ చరిత్ర ఎందుకు చదవాలి-4

ప్రజలే చరిత్ర నిర్మాతలు : చరిత్ర నిర్మాతలు ఎవరు? వీరులా? బానిసలా? భావ, భౌతిక వాదాలకు చరిత్ర వ్యాఖ్యానం గురించి ఏనాటి నుంచో జరుగుతున్న సంఘర్షణలో తేలకుండా మిగిలిపోయిన ప్రశ్నలివి. దోపిడీ వర్గాలు, తమ పాలన కొనసాగించుకునేందుకు వేలాది ఏళ్ల నుంచి వీరులే చరిత్ర నిర్మాతలు అంటూ భావవాద దృష్టిని ప్రచారం చేస్తున్నారు. దోపిడీ వర్గాల కొమ్ము కాసే కొద్దిమంది కథానాయకులే మేధావులని అదే దైవ నిర్ణయం అని వాళ్లే చరిత్ర నిర్మాతలని చెబుతున్నారు. జనం ఉత్త గొర్రెల మంద అని, మంద బుద్ధులని, వారు కథానాయకుల కనుసన్నలలో మెలగవలసిన వారేనని కూడా అంటున్నారు. ఈ లెక్క ప్రకారం
ఆర్ధికం

లెక్కల్లో ఉపాధి మాయాజాలం

దేశంలో నిరుద్యోగం తగ్గుతోందంటూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం గణాంకాలను ప్రచారం చేసుకుంటు న్నది. ఆ సంఖ్యల వెనుక భారత కార్మిక మార్కెట్ అసలు వాస్తవం క‌నిపించ‌కుండాపోయే ప్రమాదం కనిపిస్తున్న‌ది. వారంలో ఏడు రోజుల ఉపాధి పరిస్థితిని ఆధారంగా తీసుకొని నిరుద్యోగాన్ని కొలిచే విధానం ఉద్యోగం దొరికిందా లేదా అన్నదే చెబుతుంది తప్ప, ఆ పని ఎంత కాలం ఉంటుంది? ఎంత వేతనం వస్తుంది ? క్రమం తప్పకుండా జీతం అందుతుందా? ఆ ఉద్యోగం జీవన భద్రత కల్పిస్తుందా ? వంటి కీలక ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం లేదు. అసంఘటిత రంగమే ఆధారంగా కోట్లాది మంది బతుకుతున్న భారత్ లో
Uncategorized

నువ్వద్దే నిషేధం న్యాయమా?

న్యాయమేఅన్యాయాన్ని న్యాయమని చెప్తుందా?అయితే అది అన్యాయమే చావును నిషేధిద్దామనే న్యాయం చెప్పేదిచావు ఎవరికైనా నిషేధమే కదాచంపితే తప్పనే కదావేటగాళ్ళని నిషేధిస్తంచంపితే తప్పనికదాపోలీసోళ్ళకు పాఠం చెప్తాంకొట్టడం తప్పే కదా బతకనివ్వడం న్యాయంబతకనియ్యకపోతే ఎదిరించడం న్యాయంబతుకు బతుకులెక్క లేకపోతే అన్యాయంబతుకనివ్వకపోతే పానాలు పోయేదాకజంతువులు కూడా పోరాడుతాయిమరి మనుషులు ! నిషేధించిన గాలి పీల్వకునిషేధించిన నీడలో నిలబడకునిషేధించిన నినాదం నీకెందుకు?నిషేధించింది నీకు నువ్వేకడమదంతా ప్రజలే పదికంఠాలకు ఉరిఇది ఎవరికి వేసిన ఎర నిజమేదో తెలిసినా మాట్లాడేది రాజ్యం గొంతుకతోనిజమేదో తెలిసినా తీర్పిచ్చేది రాజ్యం వంతుతోనేకదా సత్యం చెర, ధర్మం వధమాట్లాడితే నేరంఎదురాడితే నిషేధంనిలదీస్తే ఉరిదీసుడుశభాష్ దేశమా నీ పేరే రాజకీయం
కవిత్వం

ఒకానొక సన్నివేశం

ఎవరిదో దుఃఖం నదిగా ప్రవహిస్తున్నదిఒడ్డున పిల్లలు ఆడుకుంటూ ఉన్నారుఎక్కడి నుండో పక్షులు పాడుతున్నవిఎవరు నాటారో తెలియని మొక్కలునిలువెల్లా పువ్వులతో నిండి ఠీవీగా చూస్తున్నవి ఓ నాలుగు పెద్ద వృక్షాలుచూపులతోనే ఏ పాత ముచ్చట్లో చెప్పుకుంటున్నవివాటి గలగల నవ్వులో ఏమో ఆకులై రాలుతున్నవిచెట్టుమీదున్న పావురంరాలిన ఆకుల స్థానంలో రాబోయే చిగుళ్ళను పరికల్పన చేస్తూఓ శాస్త్రవేత్తలా ఆలోచిస్తున్నదిదట్టమైన చెట్ల పొదలుపొద్దుగుంకని తలపోతలను ముందేసుకున్న వృద్ధుల్లా నెమ్మదిగా కదులుతున్నవిపొద్దులు వెలిగించేందుకు రేయంతా జాగారం చేస్తున్న వృద్ధుల్లాగే అవి గంభీరంగా ఉన్నవిరెండు ఉడత బుడతలుఆ పొదల లోపలికీ బయటికీ పదే పదే పరుగులు పెడుతూ సరదా పడుతున్నవిసూర్యుడు దుఃఖనదిలోకి మౌనంగా నిష్క్రమిస్తున్నాడుచీకటి చిక్కగా పరచుకోవడానికి
కవిత్వం

షహీద్ భగత్ సింగ్ జన్మదినాన

భగత్ సింగ్నీ ముందు మృత్యువు నిలబడినీకోసం నిరీక్షిస్తున్నపుడు,నువ్వప్పుడు లెనిన్ తో మాట్లాడుతున్నావు"రాజ్యం - విప్లవం" 71వ పేజీలో(నువ్వు వదిలిపోయిన) బుక్ మార్క్ నునీ సహచరులు తొలగించారువాళ్లు ఆ పుస్తకాన్ని పూర్తిగా చదివారుఅంతేకాదు, నువ్వు చదువాలనుకున్నమరిన్ని పుస్తకాలు కూడ చదువుతున్నారు నీ అమరత్వం తర్వాతనదిలో ఎంత నెత్తురు ప్రవహించిందో చెప్పలేంకాని రాజ్యం దమన నీతి మారలేదువిప్లవ అవసరం కూడా మారలేదుభూమి మీద చిందిననీ రక్తంలోఎంత ధూళి కలిసిపోయిందో ... ధాత్రి పైన రాలిందిఏదీ వృథా కాదురక్తమైతే అసలే (వృథా) కాదుధరాగర్భంలో కూడుకున్న ఈ రక్తంఒకరోజు ఉష్ణమై ఉబికి వస్తుందిఒక జ్వాలాముఖి విస్ఫోటనమవుతుందినీ సహచరులుఈ జ్వాలాముఖి శిఖలపైన చాయ్ కెటిల్ పెట్టి,నిన్ను
కవిత్వం

ఉరి

మ‌ర్రి మాను వోడ‌లు ప‌ట్టుకునిమా ఊరి చెరువు మీదుగా ఊగుతూ..చాలా సార్లే చూశాను..ఆకాశం క‌ద‌ల‌డం.. జ‌త‌గా ఊగడం..న‌న్ను ఉడికించి న‌వ్వడం..చేతులు వ‌దిలేయ‌మంటూ క‌వ్వించ‌డం.. చూశాను నాలోకి దిగుతున్న ఆకాశంచెలిక‌త్తైన‌..నాదైన‌.. ఆకాశం అలా ఊగుతూ..కొమ్మ నుంచి కుందేటి కొమ్ము మీదకు దుంకుతూ..ఆదివాసీ గూడెంపై వెన్నెల‌లు ప‌రుస్తూ..అంత‌లోనే నాపైకి దూకుతూ..చూశాను ఆకాశం తెల్ల బ‌డ‌టం..న‌ల్ల బ‌డ‌టం, ఎర్ర బ‌డ‌టం..చూశాను వ‌క్ర రేఖ‌లను భేదించిన‌ ఆకాశందీక్ష‌గా స‌ప్త ధ‌నుద్ధారైన ఆకాశం చేతులిస్తున్న వేళ ప‌క్షుల‌కు..క‌మ్మిన మ‌బ్బుల్లో చూశానువ్య‌క్తావ్య‌క్త ఆకాశం ఊగే వోడలు తెగుతున్న నిశ్శ‌బ్ధంఆట‌కు రావా..అంటూ బాబు మారం,ఎత్తుకోవా అంటూ కాళ్ల‌క‌డ్డం ప‌డ‌టం గుర్తొచ్చి,అప్ర‌య‌త్నంగా క‌ద‌లాడిన నీటి పొర. అమ్మా అని పిల‌వాల‌ని