నవ్ కల్చరల్లీ – అంతా సనాతనం
స్నానం ఒక పవిత్ర విధిసరాసరి, చిన్నపంచెతో బజార్లో ప్రత్యక్షంఆ మొక్కల పువ్వులనవ్వుల్నీతడి బట్టతో కోయడమొక కర్తవ్యంగాలాడనిచోట బంధించటంఓ ఘనకార్యం సుమ సమూహాలకదో జైలుసహజంగా వికసించడం నేరంమనుషులంతా సమానంగాజీవించడం మహా పాపం తులసి మొక్కకు రాగిచెంబునీళ్లుసూర్య నమస్కారం,జందెం పోగుల్లేని బాపన్లే అంతా-ఎక్కడో అగ్రహారాల్లో కాదుపట్టణాల్లో మహామహా నగరాల్లోడిగ్రీల పీజీల ఉద్యోగ అధికారనిచ్చెన మెట్ల నవ సమాజంలోఅంతో ఇంతో ఎదిగిన నానాకులపుంగవులు , ఎకడమిష్టులుసారీ! ఆడవాళ్లు పూజలుచేస్తేపర్వాలేదనటం కాదుపాపం! వాళ్లింకా ఏర్పాట్లలోనే,అన్నింటా మరో అడుగు వెనకాలే, ఆధునికత ఇలాగ వర్ధిల్లుతోందికార్పొరేట్ భారతంలో..ఫాసిజానికి,ఎన్నెన్ని సానుకూలతలో .. వాడు సమస్త వైవిధ్యాల్నిజీవన సౌందర్యాల్నితన ఉన్మాదంతో ముడేసివేనవేల శతాబ్దాలు నడిచొచ్చినసమాజాన్ని మధ్యయుగాల అగాధాల్లోకి తేలిగ్గా తోసెయ్య










