కవిత్వం

మళ్ళీ

వస్తున్నారొస్తున్నారు ఖద్దరు బట్టలేసి కహానిలు చేప్పనికి దొంగ లీడర్లంతా డోచోకొని తినడానికి వస్తున్నారొస్తున్నారు మీ నోటికాడి ముద్దలాగి ఓటునడగడానికి వొస్తున్నరొస్తున్నారు పాత లీడరొచ్చి మళ్ళీ ఛాన్స్ ఆడిగినాడు కొత్త లీడర్ ఒక్క ఛాన్స్ అడిగినడు పాత లీడర్ పార్టీ పనేమిచేసింది లేదు కొత్త లీడేర్ పార్టీ కొత్తగా చేసేదేం లేదు అన్ని పార్టీలు కలిసి అందినకాడికి దోచేవే వస్తున్నారొస్తున్నారు 70 ఏండ్ల నుండి ప్రజలను దోచుకునేదొక పార్టీ పొద్దంతా పొత్తులకోసం ఎదురుచూసేదొక పార్టీ కులం పేర మతం పేర చిచ్చుపెట్టేదోక పార్టీ సెంటిమెంట్ తోని చక్రం తిప్పేదొక పార్టీ వస్తున్నారొస్తున్నారు ఓట్లకోసం వస్తారు ఉద్యోగం ఊసేత్తరు నీళ్ల జాడలేదు
సాహిత్యం కవిత్వం

యుద్ధమాగదు

ఆ ఒక్క క్షణం కోసంయుగాలుగ ఎదురుజూసిందిఆ ఒక్క ఊహఆమెను పసిదాన్ని జేసింది అల్మయిరాలోపుస్తకాలు సర్దింది" మరణాన్ని తిరస్కరిస్తున్నా "వాక్యాన్నిపక్షిని జేసిభుజంమీద మోసుకుతిరిగింది.. గుండెనిండావసంతాలపొదుముకొనిగిన్నెనిండాబువ్వవొండుకొనివొణికే చేతుల్తో ప్రియమార తిన్పించాలనిమొగులుకోసం రైతుజూసినట్టుబిడ్డడి కోసం తల్లి జూసనట్టుగేటుకు కళ్ళ నతికించిఎంత ఎదురుచూసిందో అతడురాలేదుభయపడ్డట్టే జరిగిందిఊపిరి బిగబట్టే లోపుఊపిరాగినంత పనయ్యింది. ఆమెకూ అతడికీ మధ్యరాజ్యం..పూలరెక్కలమీదబుల్ డోజర్ నడిచింది మధ్య యుగాలకేసిముఖంతిప్పిన కోర్టుప్రజలకోసం కొట్టుకునే గుండెప్రమాదమన్నది****" అమ్మా..ఇక నాయినరాడా? "మెలిపెట్టే బిడ్డప్రశ్నల్నీఅంతరంగ సముద్రాల్నీ అదిమిపట్టితెగుతున్నఆశల దారాల్ని పేనుతూమళ్ళీచౌరస్తాలో నిలబడ్దదామె.. యుద్ధ మాగదు..
కవిత్వం

నేనొక ప్రపంచాన్ని కలగంటున్నాను

ఎక్కడా మనిషి మరో మనిషిని హీనపరచలేని ప్రపంచాన్ని నేను కలగంటున్నాను ఎక్కడ ప్రేమ భూమిని ఆశీర్వదిస్తుందో దాని దారులను శాంతితో అలంకరిస్తుందో ఆ ప్రపంచాన్ని నేను కలగంటున్నాను ఎక్కడ అందరూ తీయని స్వేచ్ఛా మార్గాన్ని తెలుసుకోగలరో ఎక్కడ ఆత్మ దురాశ రసి కారదో లేదా మన రోజు ధనాశ మడతలో చిక్కదో నేనా ప్రపంచాన్ని కలగంటున్నాను ఎక్కడ నలుపో తెలుపో మీది ఏ జాతైనా అవ్వొచ్చు భూమి వరాలు అందరికీ పంచబడాల ప్రతి మనిషీ స్వేచ్ఛాజీవి కావాల ఆ ప్రపంచాన్ని నేను కలగంటున్నాను ఎక్కడ దౌర్భాగ్యం తల వేలాడేయగలదో సంతోషం ముత్యంలా మెరవగలదో అందరి అవసరాలూ చూసే మానవత్వం
సాహిత్యం కవిత్వం

మరణం అతనిదేనా….

  ప్రేమను వ్యక్త పరిచే   మానవులు వున్న నేలపైనుండి   ఒకానొక మనిషి   దారి చేసుకుంటూ తరలిపోయాడు.   పంజరాన్ని ధ్వంసం చేసి   పావురం కళ్ళల్లోకి చూచిన వేగుచుక్క-   దేహ రహస్యం తెలిసిన ఆఖరి మనిషి   భూమి ఆలింగనంలో   కంటి పాపను దాచుకున్నాడు    జాబిలి వైపు చిరునవ్వు విసిరి    అంధకారపు ఆకాశంలోకి     నక్షత్ర వల విసిరి     నేలపై వెలుగును శాశ్వతం చేసిన వాడు     మరణం అతనిదేనా     ఒక కలను మోసిన వారందరిది     ఆకలి
కవిత్వం

ఎలా నమ్మాలి నిన్ను?

బిర్సా ను గౌరవించడమంటే అతని ఆశయాల్ని కొనసాగించడమే. *అతడు మతాన్ని వదులుకున్నాడు. నువు మతం ముసుగేసి అతడికి దండేస్తున్నావ్ఎలా నమ్మాలి నిన్ను? *మా దిగంతం మాకుందిమమ్మల్ని మేముగా బతకనివ్వన్నాడతడునువ్వేమో మా నేలను మోసుకుపోతున్నావ్ఎలా నమ్మాలి నిన్ను? *చెట్టు మా దేవత అన్నాడతడునగర నవ నిర్మాణమని అడవిని ధ్వంసం చేస్తున్నావ్ఎలా నమ్మాలి నిన్ను?*నను మనిషిగా మారమన్నదతడుమరి నువ్వు? నా గురించి మాట్లాడిన ప్రతివాడికీ ఒక అండాసెల్ సిద్ధం చేస్తున్నావ్ ఎలా నమ్మాలి నిన్ను?*ఆ రోజు అతడి గురి ఆంగ్లేయుడిపైనేఅది స్వాతంత్రపోరాటమన్నావ్ఈ రోజు?నాదీ స్వతంత్రపోరాటమంటే భయపడుతూ తూటాల వర్షం కురిపిస్తున్నావ్ఎలా నమ్మాలి నిన్ను?*అతణ్ణి గౌరవించాలంటే నన్నూ గౌరవించాలినన్ను గౌరవించాలంటే నా నేలను
కవిత్వం

పువ్వులు

కొన్ని పువ్వుల్ని ఏరుతున్నాను నేస్తం కాస్త పరిమళం కోసం! మనుషులు మనుషుల వాసన వేయడం లేదు అనేక వాసనల్లో వెలిగిపోతున్నారు అనుమానాల వాసన అబద్ధాల వాసన అసూయల వాసన ద్వేషాల వాసన... ఊపిరి సలపని వాసనల నుండి కొంచెం దూరం జరిగి- కొన్ని పువ్వుల్ని ఏరుతున్నాను నేస్తం కాస్త పరిమళం కోసం! సున్నితత్వాలు నామోషీ అయ్యాయి వజ్ర సదృశ పొరలలో నాగరికత నవ్వుతోంది ఎవరు పడిపోతున్నా ఎవరు వెనకపడిపోతున్నా ఎవరు చస్తున్నా ఎవరు ఏడుస్తున్నా కులాసాగా చూస్తున్న గొప్పతనాలకు కొంచెం దూరం జరిగి- కొన్ని పువ్వుల్ని ఏరుతున్నాను నేస్తం కాస్త పరిమళం కోసం! ఎంతైన పువ్వులు పువ్వులే కదా
కవిత్వం

య్య..స్..

య్యస్ ... మీరు నన్నునక్సలైటు కొడుకనిఅన్నప్పుడల్లా ....నా కాలర్ ఎర్రజండాలా ఎగురుతుంది.! *** అర్బన్ నక్సలైటు అనివేలెత్తి చూపినప్పుడల్లాఆత్మవిశ్వాసంతోతిరగబడుతున్న దండకారణ్యపిడికిళ్ల రూపమవుతా ! ***నన్ను నాస్తికుడనిమీరు నవ్వినప్పుడుమీ నవ్వే చెప్పింది ...నాస్తికత్వం మనిషికినవ్యానంద జీవన మార్గమని !
కవిత్వం

నాకిప్ప‌డు  న‌ది కావాలి

నాకిప్పుడు కావల్సింది సూర్యునితో పాటు తిరిగి చీకటికి తలవంచిన పొద్దుతిరుగుళ్లు కాదు చీకటిలోను తలవంచని ఎర్ర మందారాలు కావాలి వాటి పరిమళాలు కావాలి నాకిప్పుడు కావల్సింది కొద్ది జల్లులకే నిండి కొద్ది ఎండకే ఎండిన కుంటలు కాదు కుచించుకుపోని యాంగ్సీ లాంటి నదులు కావాలి దాని ఘర్జనలు కావాలి నాకిప్పుడు కావల్సింది వసంతంలో మాత్రమే ఎగిరే బురక పిట్టలు కాదు ఏ కాలంలో నైనా పైకెగిరే ఫినిక్స్‌ పక్షులు కావాలి వాటి వేగం కావాలి నాకిప్పుడు కావల్సింది బిగించిన పిడికిళ్లు వాలిపోయిన చేతులు కాదు బందూకు చివరి వరకు దించని భుజాలు కావాలి వాళ్ల ధైర్యం కావాలి
సాహిత్యం కవిత్వం

అక్షరాల పై నిషేధం

ఆకలి ఆక్రందనలుఅత్యాచారలు  అన్యాయపుకారు చీకట్లను చీల్చె అక్షరాలపై నిషేధమా..?అంటరాని పూరి గూడిసేలనెగడయి నిటారుగ నిలబడికందిలయి దీపమయినందుఅక్షరాలపై నిషేధమా..?నొసటి మీద చమట నేల చిందనిదేచదును కాని హలంసేద్యపు గింజల రాశులు పోసిన చొటకర్షకులు కాయకష్టంబయిన అక్షరాలపై నిషేధమా..?అణిచివేతలపై తిరుగుబావుట జెండాయైప్రజల గొంతుకల పోరు పాటలయిప్రతిధ్వనించిన నేలలో అక్షరాలపై నిషేధమా..?అసమానతల కంఠాన్ని తెగనరికితెలంగాణ ఉద్యమ రాగాన్ని పల్లవించియెల్లలు లేని ప్రపంచానికి చాటినఅక్షరాల మీద నిషేధమా..?ఆర్థిక రాజకీయ కోణాన్ని విడమర్చి చాటిహక్కులకై సల్పిన పోరులో నెగడయి మండుతున్నఅక్షరాలపై నిషేధమా..?అవునుఈఅక్షరాలు ఇప్పుడు నిషేధమెఅప్పుడు నిషేధమెరాజ్యాన్ని ప్రశించినందుకురాజ్యపు  నిషేధాలా కొలిమిలొంచికాగడాలయి అక్షరాల మంటలనుదావనంలా వ్యాపిస్తాయి... (విరసం పై నిషేధాన్ని ఖండిస్తూ....)
సాహిత్యం కవిత్వం

క‌ళ్లారా చూశాము

కామ్రేడా.... ఆర్‌కే అమరులు అస్తమయంలోనుంచే ఉదయిస్తారనే మాటను మొన్ననే మేము కళ్లారా చూశాము. ఆర్‌కే  అమడ‌య్యాడ‌న‌గానే ఎన్ని హృదయాలు అయ్యో.. ఆ మాట అబద్ధం అయితే బాగుండని తల్లడిల్లయో సరిగ్గా అప్పుడే చూశాము కామ్రేడా.. నీవు మరణిస్తూనే రెట్టింపు వెలుగుతో  ఉదయిస్తూన్నావని అస్తమయం క్షణకాలమని అది వేన వేల వెలుగుతో అరుణోదయం తప్పదని కామ్రేడా.. మేము మొన్ననే చూశాము ఉక్కు సంకల్పంతో నువ్వు హామీపడ్డ మాటని నేలకొరిగి నెరవేర్చినప్పుడు "జీవిస్తాం జీవిస్తాం ప్రజల కోసమే జీవిస్తాం మరణిస్తాం మరణిస్తాం ప్రజల కోసమే మరణిస్తాం" అని నీవు హామీపడ్డ మాటను ఆలింగనం చేసుకున్నప్పుడు కామ్రేడా.... మేము మొన్ననే చూశాము  కోట్లాదిమంది