పితృస్వామ్యంపై ఫేస్ ఆఫ్ ‘స్టోమా’
కొన్ని పుస్తకాలు మనుషుల జీవిత గాథల్ని వినిపిస్తే, మరికొన్ని పుస్తకాలు వాటిని వ్యాఖ్యానిస్తాయి. కానీ గీతాంజలి గారు రాసిన 'స్టోమా' పుస్తకం స్త్రీల విషాద లైంగిక గాథల్ని ఒక చలనచిత్రం వలె పాఠకుల కళ్ళముందు దృశ్యమానం చేస్తుంది. బయటకు కనబడని వికృత పురుష మానసికతను, అమానుష లైంగికతను లైవ్ గా చిత్రిస్తుంది. మన సమాజంలో స్త్రీల అనంత విషాదానికి ప్రత్యక్షంగా పురుషుడే కారకుడుగా కనిపించినప్పటికీ, పరోక్షంగా పురుషులను (స్త్రీలను) కూడా నడిపించే దుష్ట పీడక సంప్రదాయాలు, దోపిడి సామాజిక వ్యవస్థ ఉన్నాయనే వాస్తవాన్ని మనం పట్టించుకోకుండా ఉండలేము. ఇందులో చిత్రించిన 13 కథలకు ఎంతో వైవిధ్యపూరితమైన సామాజిక నేపథ్యం










