1917లోనే అచ్చయిన చతురిక..!
ఈ నవల తొలి పుటలో పరిశోధనల చరిత్రకెక్కని నవల అంటూ ఈ నవలను సేకరించి ముద్రించిన తెలకపల్లి రవి చెప్పుకున్నారు. నిజమే చరిత్రకెక్కని, చరిత్రలో చోటివ్వని అనేక విషయాలు కర్నూలు సాహిత్య చరిత్రలో ఉన్నాయి. కర్నూలు జిల్లా సాహిత్య చరిత్రను పరిశీలించినట్లైతే ప్రపంచంలోనే తొలి తెలుగుపదం ‘అన్ధిర లోహము’ అనగా ఆంధ్రలోకము అనే పదం కర్నూలు జిల్లా కన్నమడకలలో లభించినది.ఇది అత్యంత ప్రాచీన శాసనంగా గుర్తించారు. తొలి తెలుగుపదం ‘నాగబు’ అని నిర్ధారించినప్పటికీ అంతకుముందే ‘ఆంధ్రలోకము’ అనే పదమున్నప్పటికీ సాహిత్యకారులు, చరిత్రకారులు సమాజక్షేత్రంలోకి తీసుకెళ్ళలేకపోయారు. ఆ పదం కర్నూలుజిల్లాలో లభించడం అరుదున విషయం. ప్రపంచానికి బౌద్ధ సిద్ధాంతాలను ప్రవచించిన










