సంపాదకీయం

మ‌న హృద‌యం, ఆలోచ‌న‌లు, చేతులూ పాల‌స్తీనా కోస‌మే

70 ఏళ్లుగా ఆ నేల  పాలస్తీనా ప్రజల రక్తంతో త‌డుస్తోంది. వాళ్ల తమ జాతి విముక్తి  ఆకాంక్ష ప్ర‌పంచ‌మంతా పిక్క‌టిల్లుతోంది. ఆ ప‌క్క‌నే ఇజ్రాయిల్ దారుణాలు వినిస్తున్నాయి.  అరబ్బుల నిర్మూలనే లక్ష్యంగా ఏర్పడింది ఇజ్రాయిల్. ఈ మే 14తో దాని దురాక్రమణకు 70 ఏళ్ళు నిండుతాయి. ఈ 70 ఏళ్ల కాలంలో లెక్కలేనన్ని సార్లు అది పాలస్తీనా ప్రజల అంతమే లక్ష్యంగా దాడులు చేసింది. ఈ సారి దానికి మే 7 ను ఎంచుకుంది. జెరూసలెంలోని ఓల్డ్ సిటీలో అల్-అక్సా మసీదు కాంప్లెక్స్ ఉంది. ముస్లింలకు అత్యంత పవిత్రమైన స్థలాల్లో ఇది ఒకటి. రంజాన్ మాసం చివరి శుక్రవారం సందర్భంగా
సంపాదకీయం

శాంతి చర్చలు – హింసపై వైఖరులు

శాంతి కోసం ప్రయత్నించవలసి వచ్చిందంటేనే  సమాజంలో అశాంతి నెలకొని ఉన్నట్టు. ఈ ప్రయత్నం ఎందాక నడుస్తుందో ఇప్పటికిప్పుడు  చెప్పలేకపోవచ్చు. శాంతి సాధనకు ఉండగల మార్గాలన్నీ వాడుకోలేకపోయినా సరే,  అశాంతి గురించి ఆలోచించే అరుదైన సందర్భం వచ్చిందని భావించవచ్చు. అశాంతికి కారణాలను లోతుగా వెతకవచ్చు. అయితే ఈ పని చాలా ఓపికగా  జరగాలి. వీలైనంత ఓపెన్‌ మైండ్‌తో వ్యవహరించాలి. దానికి సిద్ధమైతే మామూలప్పుడు గ్రహించిన విషయాలనే మరోసారి సూక్ష్మస్థాయిలో చూడ్డానికి వీలవుతుంది. అప్పుడు కొత్త కోణాలు కనిపిస్తాయి. అది ఎట్లా ఉంటుందంటే, సమాజమే తన అనుభవాలను, విశ్వాసాలను, వైఖరులను తరచి చూసుకున్నట్లుగా ఉంటుంది. ఇదంతా సమాజాన్నంతా తీవ్ర అశాంతికి లోను
సంపాదకీయం

ఎన్నికల తరువాత ..

‘ఎన్నికల వేడి’ అంటారు కదా. అది ఎన్నికలయ్యాక చల్లారిపోతుంది. మళ్లీ ఏవో ఎన్నికలు వచ్చే దాకా అంతా చల్లదనమే. పోలింగ్‌ పాలకుల తలరాత మారుస్తుంది. కొత్త వాళ్లు అధికారంలోకి రావచ్చు. పాత వాళ్లే కొనసాగవచ్చు. అద్భుతాలు జరిగినా, జరగకపోయినా ఏదో ఒక రకంగా ‘పాలించడబడటం’ ప్రజలకు మామూలవుతుంది. వేడి చల్లారిపోవడం, కొత్తపోయి పాతపడటం  అంటే ఇదే. కాకపోతే మొన్నటి సాధారణ ఎన్నికలకు కొంత ప్రత్యేకత ఉంది. ప్రధాన స్రవంతి పత్రికల్లో కూడా ఇది కనిపించింది. బీజేపీ కూటమికి, ఇండియా కూటమికి మధ్య భావజాల ఘర్షణగా కూడా  చూశాయి. నిజానికి ఇది దిన పత్రికలకు అందే వ్యవహారం కాదు. వాటి  
సంపాదకీయం

పుస్తకం ఎవరికి ప్రమాదకారి?

ఇవాళ దేశంలో జ్ఞానం అన్నిటికన్నా ప్రమాదకరమైనది. దానిని మోసే పుస్తకం, ఆ పుస్తకాన్ని రాసే, చదివే వ్యక్తులు ప్రమాదాకారులు. ఎలాగో మూడు ఉదాహరణలు మాత్రం చెప్తాను. మావోయిస్టు నాయకుడు ఆర్. కె. జ్ఞాపకాలతో ప్రచురించిన సాయుధ శాంతి స్వప్నం పుస్తకాలను ప్రెస్ నుండి విడుదల కాక ముందే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పుస్తకాలను నిషేధించిన హీనమైన చరిత్ర కూడా మనకుంది కానీ అందులో ఏముందో కూడా చూడకుండా ఎత్తుకుపోవడం బహుశా ఇప్పుడే చూస్తున్నాం. వెయ్యి కాపీల పుస్తకాల కోసం వంద మంది ప్రెస్ మీద దాడి చేసి భీభత్సం సృష్టించి, వాళ్ళ ప్రాపర్టీ ఎత్తుకుపోయి వాళ్ళ మీదే కేసులు
సంపాదకీయం గెస్ట్ ఎడిటోరియల్

రాజ్యాంగాన్ని, రాజ్యాంగవాదాన్ని విమర్శించకూడదా?

విజయవాడలో ఇటీవల జరిగిన 29 వ మహాసభల సందర్భంగా విరసం ఒక కీనోట్‌ పేపర్‌ను విడుదల చేసింది. దాని శీర్షిక ‘‘ఫాసిస్టు సందర్భంలో రాజ్యాంగవాదం’’. ఆ కీనోట్‌ పేపర్‌ ను కా.పి. వరలక్ష్మి మహాసభల్లో ప్రవేశపెట్టారు. దానిపై మహా సభలు ప్రారంభం కాకముందే చర్చలు మొదలయ్యాయి. ఆ తర్వాతా మౌఖిక, లిఖిత రూపాల్లో అనేక ప్రతిస్పందనలు వెలువడ్డాయి. ఆ ప్రతిస్పందనలలో విరసాన్ని తప్పుపడుతూ ఈ కింది అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.                                                                        విరసం రాజ్యాంగవాదాన్ని విమర్శిస్తున్నదంటే అంబేద్కర్‌ను విమర్శిస్తున్నట్టని, రాజ్యాంగం ద్వారా అందాల్సిన హక్కులు, రక్షణలు దళితులకు, పీడిత సమూహాలకు దక్కకుండా చేసే ఉద్దేశం విరసానికున్నదని కొందరు భావించారు. రాజ్యాంగం
సంపాదకీయం

సాహిత్య విమ‌ర్శ‌కు సొంత కార్య‌క్షేత్రం లేదా?

ఈ న‌డ‌మ ఏదో ఒక రూపంలో సాహిత్య విమ‌ర్శ గురించిన చ‌ర్చ‌లు  జ‌రుగుతున్నాయి . ఇప్పుడు  ఆ చ‌ర్చా సంద‌ర్భాల గురించి   మాట్లాడ‌బోవ‌డం లేదు.  అవి కొన్ని ముఖ్య‌మైన విష‌యాల‌ను  ప‌రోక్షంగా ముందుకు తీసుకొచ్చాయి.  అవి మాట్లాడుకుంటే చాలు.   సాహిత్య విమ‌ర్శ ప‌ని ఏమిటి? దానికి  సొంత కార్యక్షేత్రం ఏదైనా ఉన్న‌దా?    విమ‌ర్శ అనేది సాహిత్యం మీద‌,  సాహిత్య‌కారుల మీద ఆధార‌ప‌డిన ప‌రాన్న‌జీవి మాత్ర‌మేనా?     ర‌చ‌యిత‌ల‌ను పొగిడి వాళ్ల మెప్పు పొంద‌డంతో విమ‌ర్శ కార్య‌క్షేత్రం ముగిసిపోతుందా?  అనేవి ఆలోచించాలి.  నిజానికి సాహిత్యం గురించి   మాట్లాడుకొనేట‌ప్ప‌డు *సాహిత్య విమ‌ర్శ‌* ఆట‌లో అరిటిపండులా మారిపోతోంది. నేరుగా దాని గురించి
సంపాదకీయం

ఫాసిస్టు సందర్భంలో రాజ్యాంగవాదం

విప్లవ రచయితల సంఘం 29వ మహా సభలు27 , 28 జనవరి 2024 , సిద్ధార్థ అకాడమీ , విజయవాడ విప్లవ రచయితల సంఘం 29వ రాష్ట్ర మహా సభల ఇతివృత్తం ‘ఫాసిస్టు సందర్భంలో రాజ్యాంగవాదం’. విప్లవోద్యమ మేధో, సాంస్కృతిక కంఠస్వరమైన విరసం ఆశయం ప్రజా జీవితంలోని సంక్షోభాలను విశ్లేషించడం. వాటికి ఉండగల పరిష్కారాలను ఎత్తి చూపడం. ఈ పని ఫాసిజం చెలరేగిపోతున్న సమయంలో మరింత సునిశితంగా చేయవలసి ఉన్నది. దేనికంటే మన సామాజిక సాంస్కృతిక జీవితం  చాలా జటిలంగా మారిపోతున్నది. వ్యక్తిగత, బహిరంగ జీవితాలు కల్లోలభరితంగా తయారయ్యాయి. ఆధునిక ప్రజాస్వామిక విలువలు సంక్షోభంలో పడిపోయాయి. మానవ సంబంధాల్లో
సంపాదకీయం

మావోయిస్టు పార్టీ మీద నిషేధంఎందుకు ఎత్తేయాలంటే…

విష్లవ పార్టీ మీద నిషేధం తొలగించాలని కోరడం అంత మామూలు డిమాండ్‌ కాదు.  దీని చుట్టూ ఎన్నో అంశాలు ఉన్నాయి. కాబట్టి సహజంగానే చాలా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వాటన్నిటినీ చర్చించాల్సిందే. ముందు ఆ పని చేయకపోతే నిషేధం తొలగించాలని ఎందుకు కోరుతున్నామో చెప్పలేం. మావోయిస్టు పార్టీ మీద నిషేధం ఎత్తేయాలనే మాట 2004 తర్వాత మళ్లీ ఇవ్చుడే వినిపిస్తోంది. ఇంత నుదీర్ఘకాలం ప్రస్తావనలో లేకపోవడం వల్ల ఈ డిమాండ్‌ చాలా కొత్తగా ఉన్నది. ఎంతగానంటే మావోయిస్టుల మీది నిషేధం మామూలే కదా! అని సమాజం చాలా వరకు కన్విన్స్‌ అయిపోయింది. చర్చ లేకుండా, చర్చించాల్సిన విషయం కాకుండాపోయి, దాని
సంపాదకీయం

ల‌క్ష ద్వీప్ కోసం మాట్లాడ‌దాం

లక్ష ద్వీప్ మనకు పడమట దిక్కున ఉన్న దీవులు. ముప్పై ఆరు దీవుల సమూహం. డెబ్భై వేలకు పైగా జనాభా ఉన్న ప్రాంతం. 97 శాతం వరకు ముస్లిం జనాభా ఉంటుంది. మిగతా మూడు శాతం బయటి నుండి వచ్చిన వారు. అక్కడ గత కొన్ని వారాలుగా ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు. కారణం తమ నేల నుండి తమని పరాయి వారిని చేయడానికి బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు. సాధారణంగా కేంద్ర పాలిత ప్రాంతలకు ఐఏఎస్ లేదా ఐపిఎస్ అధికారులను పరిపాలన అధికారులుగా రాష్ట్రపతి నియమిస్తారు. కానీ గత డిసెంబర్లో గుజరాత్ కు చెందిన భాజపా నేత ప్రఫుల్ ఖోడా
సంపాదకీయం

ఈ నిషేధాన్ని అంగీక‌రిద్దామా?

విర‌సం మ‌రోసారి నిషేధానికి గురైంది. తెలంగాణలో విర‌సం  సహా పదహారు ప్రజాసంఘాలను నిషేధించారు. మార్చి 30 న త‌యారు చేసిన జీవో నెంబర్ 73లో  పదహారు  ప్ర‌జా సంఘాలు మావోయిస్టు పార్టీ అనుబంధ సంఘాల‌ని  పేర్కొన్నారు.  ఇవి  మావోయిస్టు పార్టీ వ్యూహం ఎత్తుగడల ప్రకారం పనిచేస్తున్నాయన్నది ఆరోపణ. తెలంగాణ డిజిపి చీఫ్ సెక్రటరీకి 12 మార్చి 2021 న ఒక లెటర్ పంపారు. దానికి ప్రతిగా మార్చి 30న తెలంగాణ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ పేరుతో ఈ జోవో విడుదల అయింది. అయితే అది ఇరవై నాలుగు రోజుల తరువాత ఏప్రిల్ 23 న పత్రికలకు చేరవేశారు. మామూలుగా