సాహిత్యం కవిత్వం

పోతూ పోతూ

పోతూ పోతూమనంఇంత ఆస్తినీకాసిన్ని జ్నాపకాల్నీవారసత్వంగా ఇచ్చిచరిత్ర మడతల్లో అంతర్ధానమౌతాం పోతూ పోతూఅతడుశోకతప్త ఇంద్రావతి నీరగులుతున్న అడవినీశాంతి కోసం యుద్ధాన్నీవారసత్వంగా ప్రకటించి వెళ్ళాడు.. ముఖం లేనివాళ్ళ ముఖమైగొంతులేనివాళ్ళ గొంతైఅనాది ఆదివాసీ ఆర్తనాదమైమిగలాల్సిందేదోతగలబెట్టాల్సిందేదోప్రకటించి వెళ్ళాడు.. అతణ్ణి స్మరించడమంటేగాయపడ్డ పావురాన్నిప్రేమగ హత్తుకోవడమేగడీల మీదకుఫిరంగులు పేల్చడమే..నూతన మానవావిష్కరణకు ఎదురేగడమే 15-09-21
సాహిత్యం కవిత్వం

స్వప్నకథనం

శూన్యగోళంలో తిరుగాడే పిట్టజీవావరణంలో ఇమడలేకగహన గగనం చేరలేకమన బాల్కానీ ఊచల మీద టపటపమన తలుపుల మీద టకటకమన గుండెలకు దగ్గరగా గునగునగుండే గువ్వై ఎగిరిపోన... కల అయిపోలేదుతూటాల మీదుగా పూలతుంట్లు తుంచిపాపల బుగ్గల నుంచి లేత గులాబీలు తెంచిమొర చాపిన లేగ ముట్టెకు ముద్దిచ్చిముట్టించి, ముట్టడించి,దట్టించి, దహించిరివ్వున. కెవ్వన... ఎగిరిపోన.. కలఅయిపోలేదుకనలి కనలికదిలి కదిలిఉప్పటి కన్నుల మీదుగా జారిచప్పటి పెదవుల మీదకు చేరిచప్పున తోలేలోపే ఎగిరిపోన..
సాహిత్యం కవిత్వం

ఎర్రెర్రని దండాలు

అన్నా! ఆర్కె!!భోరున వర్షంవడి వడిగా పారాల్సినచంద్రవంక పారనని మొరాయించింది నాగులేరు నా వల్ల కాదనికారంపూడి కనుమల్లో కన్నీరు మున్నీరుగా విలపిస్తుందిపుల్లల చెరువు నీరు నీ దాహార్తి తీరుస్తా రమ్మంటూ ఆహ్వానిస్తుంది కాకిరాల కనుమలునీవొస్తావని కళ్ళల్లో వత్తులు వేసుకుని నిరీక్షిస్తున్నాయిబొల్లాపల్లి బోడులు నీ పాద స్పర్శ కోసం తండ్లాడు తున్నాయిగుత్తికొండ బిలం లోమన పార్టీ అంటూ నీవు చేసిన ప్రసంగం ఇంకా ప్రతిధ్వనిస్తోంది మాచెర్ల డిగ్రీ ప్రాంగణం లో నీవెగురేసినరాడికల్ జెండాల రెపరెపలు పల్నాడు దాటిరాష్ట్ర సరిహద్దులావల మహోద్యమ కెరటాలై ఎగిసాయి యుద్ధం జరగాలిశాంతి కావాలంటూ చర్చలకైనల్లమల తోరణం చిన్నారుట్ల నుండినీ అడుగుల సవ్వడి మరో చరిత్ర దిశగా అసంపూర్తి
సాహిత్యం కవిత్వం

సబ్జెక్ట్‌ కరెక్షన్‌

బిర్యానీ తినిపించి బంగ్లా రాయించేసుకొన్నాకకత్తి చేతికందించి మెడ తెంచుకుపోయాక మత్తు దిగేక అస్తుబిస్తుగా మిగిలేక ఓ మనిషీ ఓ మనీషి ఓ మహర్షీ మాయమయ్యాక కలి ఉలి ఆగిందిశిలకు ఆకలి మొదలైంది...
సాహిత్యం కవిత్వం

పిచుకలకు రెక్కలొచ్చే వేళ

సాయీనీతో పాటుగా ఇంతమందిమాటాడుతుంటే వాడికేదో భయం కదా చావు నీ ముందు కరాళనృత్యం చేసినానీ గుండె చెదరలేదునీ నిబ్బరం వెనక వున్ననమ్మకమే నీ కళ్ళలో మెరుపు కదా? నీ మాటా నీ నవ్వే వాడినిబెదరకొడుతూ వున్నాయా? ఎందుకో మాటాడే వారంటేచెదరని నవ్వుగలవారంటేరాజుకెప్పుడూ భయమనుకుంటా ఎందుకంటే వాడెక్కిన అందలమెప్పుడూముప్పాతికమంది ఒప్పుకోనిదే కదా నువ్వెప్పుడూ అంటావు కబీరునిఆలపించమనిమనుషుల్ని ప్రేమించమని కానీ వాడు ఉన్మాదాన్ని వ్యాప్తి చేస్తూదేశాన్ని దోచుకోవాలనుకుంటున్నాడు న్యాయానికి గంతలు కట్టి‌న్యాయమూర్తుల గుండెలపైఉక్కుపాదం మోపితీర్పులను తిరగరాయిస్తున్నాడు చీకటిని తెరచే ఉషోదయమొకటివేచి వుందని కబీరన్నది గుర్తుకొస్తోంది పిచుకలకు రెక్కలొచ్చినిన్ను ఎత్తుకొచ్చే కాలమెంతోదూరంలో లేదు బాబా !! (సాయిబాబా విడుదల కోరుతూ)
సాహిత్యం కవిత్వం

రగల్ జెండను భుజానికెత్తి జోహార్లందాం..!!

ఇది యుద్ధంఅనుకున్నాక..గెలుపొక్కటేలక్షమనుకున్నాక.. నువ్వూ నేనూఅతడూ ఆమెప్రజా యుద్ధానికిమారు పేరులం కదా.. జన సంగ్రామానికిజవసత్వాలౌతూజననమే కానీఎవరికైనా మరణమెక్కడిదీ.. అడవినీ మైదాల్నీకన్నీటి సంద్రాల్నీఅలుపెరుగని అమ్మవడైఆలింగనం చేసుకున్నవాడు అయిన వాళ్ళందరినీకష్టజీవి కన్నీళ్ళలోఆ బతుకు గాయాల్లోదర్శించుకున్న దార్శికుడతడు.. ఏవూరూ ఏవాడాఎవరి బిడ్డాఏవొక్కరి స్వప్నమదీఅతడికి మరణమెక్కడిదీ.. అతడి సహచర్యంలోఆయుధమూ అక్షరాలు దిద్దిచెరచబడ్డ చెల్లెళ్ళపిడికిళ్ళై విరబూయాలనిపరితపించింది.. పారే చెలిమతరాల దూపతో అల్లాడేఆదివాసీ గొంతు తడిపేకర్తవ్యాన్ని కళ్ళకద్దుకున్నది.. ఆ చెట్టూ ఈ పుట్టావాగూ వంకా పూవూ పిందేసెంట్రీ గాసిన తీతువూదాపుగాసిన గుబురు పొదలూ దుఖ్ఖ నదుల నదిమిపట్టితలలు వొంచి భుజముకెత్తివీరుడా నువ్వమరుడన్నయ్నీబాటలోనే మా అడుగులన్నయ్ కన్నీటి జ్ఞాపకాలు తొలుచుకొచ్చేబాధా బాసా మసిలే నెత్తురూ సరేదారి పొడవునా ఒలికిన త్యాగాలేచరిత్ర
సాహిత్యం కవిత్వం

స్టాచ్యు ఆఫ్ అనీ క్వాలిటి

నేను మాట్లాడనునీ చుట్టూ రియల్ ఎస్టేట్ ధూమ్ ధామ్ గురించినేను చర్చించనునీ కేంద్ర వ్యాపార సామ్రాజ్య జిలుగుల గురించినేనేమీ అడుగనునువ్వు బలోపేతం చేసే వెయ్యి తలల భూతం గురించి సమతామూర్తీ!నీ ఐదు వేల ఋత్వికులలోనేనెక్కడున్నాను స్వామీ! ఇంకానన్ను చీకట్లోనే ముంచునా మూర్ఖోదయాన్నే స్వాగతించు వెయ్యేళ్ల కింది నుండిఇప్పుడెందుకు నిద్ర లేచావోనాకు తెలియంది కాదు మనుషులంతా సమానమైతేనీ దేవుని శంఖు చక్రాలు భుజాల మీదెందుకెక్కాయి మనుషులంతా ఒక్కటైతేమెడకు ముంత నడుముకు చీపురునీకాలమెందుకు మాయం చేయలే ఇంతకు"నంగిలి"రొమ్ములెందుకునెత్తుటి మేఘాలై కురిశాయి ఇవ్వాళఅయోధ్య తలనెత్తుకున్న నేల నేలంతాఅస్పృశ్య ఆడతనంఅరణ్య రోదనెందుకైంది ని దేవుడికినా అజ్ఞానానికి మధ్యనీ కులాన్ని గురువు చేసిపౌరోహిత్యాన్ని సృష్టించి బ్రాహ్మణులుకాని
సాహిత్యం కవిత్వం

*రెవల్యూషనరీ స్ప్రింగ్*

ఏవో ఏవేవోమరుపురానిగురుతులతోకరచాలనం చేసేసనివేశాలుసందేశాలు,పూర్తిగాఆయుధంతోసాయుధమైనఓ స్వాప్నికుడిఓ ప్రేమికుడిఆలోచనతోఆశయంతోరక్తం చిందించేఆ పాదాల నడకలుఈ దేశానికిదేహాన్ని అర్పించేఆజాదిని అందించేసాహసాలుఅహామీరు ఏంతటి ప్రేమికులుఅచంగా మా భగత్ లామీరు ఎంతటి సాహసీయులు
ఎరుకల కథలు

ప్రయత్నం

దుర్గమ్మ గుడి ముందు  -  ఇందిరమ్మ ఎస్.టి. కాలనీలో ఆరోజు గ్రామసభ జరుగుతోందని, ఒకరోజు ముందే దండోరా కొట్టడం వల్ల, జనం అక్కడ గుమిగూడి పోయారు.మధ్యాహ్నం మూడు దాటింది. ఎండ చుర్రుమంటోంది. ఆ పంచాయతీలో ఉపాధిహామీ పనుల్ని పర్యవేక్షించే ఫీల్డ్ అసిస్టెంట్ రమణ వేపచెట్టు నీడలో చాపపరిచి కూర్చుని ఉన్నాడు. రెండు పాతచాపలు  ఒకదాని పక్కన ఒకటి పరచబడి ఉన్నాయి. ఆ రెండు చాపల చుట్టూ నాలుగు ఇనుప కుర్చీలు, రెండు ప్లాస్టిక్ కుర్చీలు పహారా కాస్తున్నట్లు ఉన్నాయి. చాపపైన తెల్లకాగితాలు, గ్రామసభ రిజిష్టరు, హాజరు పట్టిక, ఇంక్ ప్యాడ్, ప్లాస్టిక్ సంచిలో కొన్ని అర్జీలు రమణ ముందుపేర్చబడ్డాయి.
సాహిత్యం కవిత్వం

జియ్యం గారు 

జియ్యం గారుఆడించేది అటపాడించేది పాటవలపట ముఖ్యమంత్రిదాపట మై హోం అధినేతఅక్రమ సంపాదన కువిరాళాల కుదేవుడు -- మతం -- ఒక దారిభక్తుల కు కొదువ లేదుడబ్బు కు తిరుగు లేదు జియ్యం గారుచదువు పదవతరగతి ఫెయిల్ఫార్మ్ కంపెనీ లో లేబర్నెక్స్ట్ టైపిస్ట్ కొంత కాలంకాషాయ వస్త్రాల తోదేవుడు -- మతంహిందుత్వం --- స్వర్గంఅంటూ సూక్తులు వల్లిస్తూచే ప్పేవి సూక్తులు --దూరేవి ?????? కోట్ల కర్చుతోసమతా మూర్తిరామానుజ చార్యుల విగ్రహంస్థాపననూరు ఎకరాల భూమి లోstatue of equality పేరుతోవిగ్రహంనాడు బ్రహ్మ కుల సంగానికినాయకుడు -- రామానుజా చార్యులుదేవుడు కాదు ఏళ్ళ తరబడిమన దేశాన్ని సర్వనాశనం చేసిందిబ్రాహ్మణులేప్రతిదాన్ని రహస్యం చేసారుపుక్కటి పురాణాలు