సాహిత్యం కవిత్వం

ఈ పూలేమి నేరం చేసాయో చెప్పు ?

ఈ పూలు ఇలా చేతుల్లో ఉంటే చాలు..దేహామంతా పరిమళాల చెట్టు అయిపోక మరింకేమి అవుతుంది?ఈ పూల కెన్ని పేర్లూ -ఊర్లూఅందాలూ – బంధాలూరంగులూ – పరిమళాలు.ఈ పూలకెన్ని షాయారీలూ - గజళ్ళు.కథలూ -కవితలు .ముచ్చట్లు – మౌనాలూఈ పూలకెన్ని ఊర్లూ – దేశాలు- భూములుఇళ్ళూ – ఖబరిస్తాన్లు .ఈ పూలకెన్ని తోటలూ - ఎన్ని ఎడారులు అవన్నీ సరే .. ఇది చూడండిఈ పూలకెంత సమానత్వం., ఎంత లౌకికత్వం !కులమూ లేదు.. మతమూ లేదుకదిలే మనుషుల దేహాల మీద.. కదలని శవాల మీదఅందరి శ్మశానాల్లో సమాధుల మీదమందిరాల్లో .. మసీదుల్లో.. చర్చీల్లోఐక్యంగా ఒక్క మాలై ఊగుతాయి కదా !ఒక్కలాగే
కవిత్వం

“ఇది అబ్బాయి..అమ్మాయికి ఇద్దరికీ సంబంధించిన విషయం”!

హై స్కూల్ కి వచ్చేదాకా నేను అబ్బాయిగానే చూడబడ్డాను అమ్మాయిల స్కూల్లో ఒకే ఒక అబ్బాయి ఉండడాన్ని వాళ్ళు గర్వంగా భావించేవారు. నా జుట్టు చిన్నగా కత్తిరించి ఉన్నా.. నేను బాగా పొగరుబోతులా ఉన్నా.. నన్ను టీచర్లు..నా తోటి విద్యార్థులు ప్రేమించేవారు. నేనూ వాళ్ళని విడిచి ఉండలేనంతగా ప్రేమించాను. *** బడిలో.. ఇంట్లో నాకు అబ్బాయిలు చేసే పనులు మాత్రమే చెప్పేవారు.. నాకు అమ్మాయిలా ఉండాలని ఉన్నా .. అబ్బాయిలా ఉండడాన్ని కూడా ఇష్టపడ్డాను. అప్పట్లో నాకుండే ఒక్కగానొక్క బాధల్లా... నా స్నేహితురాలిలా పాడలేక పోతున్నాననే ! ** ఇక నేను క్యాంపులకి వెళ్లి నప్పుడు... అబ్బాయిలు పొరపాటున
సాహిత్యం కవిత్వం

వసంతం

చిన్నబోయినా కనుల కన్నీటిని తుడిసిన వేళ నిండు పున్నమి నదిపై పరుసుకున్న వేళ ఎర్రని మేఘంపైఎగిరే పక్షిని నేనై రాగం పాడే వేళ రంగస్థలములో నేను ప్రేమ రంగులద్దిన వేళ రానే వచ్చింది వసంతం ప్రేమను పేర్చింది వసంతం రానే వచ్చింది వసంతం స్వేచ్ఛను తెచ్చింది వసంతం
కవిత్వం

గాజా పసిపిల్లలు! Children of Gaza

నన్ను క్షమించండి... మీ కోసం జోలపాట ఎలా పాడాలో తెలీటం లేదు. మనం ఒక పని చేద్దాం.. దిశల లెక్కలు తేల్చే భౌతిక శాస్రం నాశనం అవ్వాలని ప్రార్థిదాం ! నిదుర పోతున్న పిల్లల మీద శత్రువు వదిలే ద్రోణులు.. బాంబులు గురి తప్పిపోవాలని ప్రార్థిదాం ! నన్ను క్షమించండి .. చనిపోయిన నా గాజా పసి పిల్లలారా.. మిమ్మల్నెలా నిద్ర లేపాలో అర్థం కావటం లేదు. మీతో పాటు నేనూ చచ్చి పోయాను ! నన్ను క్షమించండి.. ఈ ప్రపంచం తనని తాను విముక్తి చేసుకోవడానికి మన రక్తాన్ని మరింతగా కోరుకుంటోంది ! నా ప్రియమైన గాజా
సాహిత్యం కవిత్వం

దినమొక గండం పగలొక రాత్రి

రక్తంరుచి మరిగిన వలస రాబందులు వర్గ సమాజానికి వకాల్త పుచ్చుకొని రాజ్యం రక్షణే ధ్యేయంగా మా విప్లవ కేంద్రాలకు వలస సాచ్చాయి "సమాధానో"ప్రహార దాడులలో రణరక్కసి ధ్యేయంగా రక్త దాహపు వేట రాజ్యానికి పసందైన ఆట. నేడు తెలంగాణ ఒక కాన్సన్ట్రేషన్ క్యాంప్ రాజ్య నిర్బంధ శిబిరం 40 ఏళ్ల ఆవల నుంచే ఇక్కడ ఆ ఖాకీలకు మా రక్తం శీతల పానీయం మా శరీరపు మాంసపు ముద్దలు పంచభక్ష పరమాన్నాలు కానీ మా రక్తం   నిరంతర ప్రవాహం మా శరీరం అఖండితం స్మశాన ప్రశాంతత కోసమని హింస ప్రతి హింసల మధ్య యుద్ధ ఛాయలలో ఇప్పుడు ఊరు
కవిత్వం

కవితా పరాగం

1.  వొక నగ్నదేశభక్తి    చంపింది రైలేనా? రూపాయి రుచి ఎరుగని    చెమట చుక్కల్ని    ఆకలి నుండి ఆకలికి   అనంత యాత్త్రైన ఆకలి చేతుల్ని    ఆర్థికమొసళ్ళ నోటికందించింది     సుభాషితాల సింహాసనం! దేశం గిడ్డంగి    పేరుకుపోయిన ఆకలి నిల్వ!   గుర్తుపట్టని నట గుడ్డి    ఆహారభద్రత నిల్వ !!   దేశాన్ని పోతపోసే          చెమట చేతులు   ఆకలినదై     ముంచుతున్నప్పుడే     68,607కోట్ల నగ్న దేశభక్తి పొర్లి పొంగింది   సోకెవడిదో?   సొమ్మెవడిదో?     చెమట చుక్కలారా!    ఇంత నోరుంది     ఇన్ని అక్షరాలున్నై కాని    మీ
సాహిత్యం కవిత్వం

జాగ్రత్త..?

ఓ రోగిఓ త్యాగిజాగ్రత్త శవాల చేతులతోబంగ్లాలు కటించుకునేకుభేరులున్నారుజాగ్రత్త పచ్చి మాంసాన్నిపగడ్బందీగా పీక్కు తినేగుంట నక్కలున్నాయిజాగ్రత్త కాలి కాలనిబొక్కల్ని మెడలో వేసుకునికరోనాని కాటికి పంపాలనుకునేవైద్యులున్నారుజాగ్రత్త ఓ రోగిఓ త్యాగిజాగ్రత్త మున్నూట అరవై వేల కోట్లదేవుళ్ళున్నఈ పుణ్య భూమిలోఆర్థా నాధాలకిఆయుశ్శే లేదుజాగ్రత్త భారత్ మాత కి జైఅనే నినాదంలోజై తెలంగాణఅను నినాదంలోఈ దేశ చరిత్ర బందీ అయిబ్రతుకు చాలిస్తున్నది జాగ్రత్త ఊపిరి బిగబట్టుకునిఉద్యమించకుంటేరేపటి భవిష్యత్ బర్తరఫే ఓ రోగిఓ త్యాగిజాగ్రత్త నిషేధ రేఖలునిన్ను నిలువునా…చీల్చాలనుకుంటాయిజాగ్రత్త
సాహిత్యం కవిత్వం

వాళ్లిద్దరు

ప్రజల ప్రయోజనాలే ప్రాణంగాబతికిన వాళ్లు, వాళ్లిద్దరుఒకరు హిమాలయాలంత ఎత్తుకెదిగినల్లమల కాఠిన్యాన్ని పుణికి పుచ్చుకొనిశత్రువుకు నిద్ర పట్టనీయనివిప్లవ శ్రేణులకు సేనానిమరొకరు ప్రేమ మాత్రమేచైతన్యాన్ని ఉద్దీపింప చేస్తుందనిబలంగా నమ్మి ఆచరించినవాడువిప్లవ శ్రేణుల గుండెల్లో నెలవైశత్రు సేనలపైకి ఉరికించినవాడుఈ యిద్దరు వ్యూహకర్తలను, ప్రజల ప్రేమికులనుకోల్పోవడం నా, మీ వ్యక్తిగత బాధే కాదునూతన సమాజాన్ని ప్రసవించేపుడమి తల్లి పురిటి నెప్పుల బాధ కూడాఇప్పుడు గుండెల నిండా కర్తవ్యంజయించాలనే తపన, జ్ఞానం కోసం మధనంచలన నియమాలను ఒడిసి పట్టుకోవాలనే ఆరాటంఅమరుల శక్తిని నిబిడీకృతం చేసుకున్న ప్రతి అడుగూమరింత దృఢంగా ప్రజల పక్షంఅందుకేఓటమి తాత్కాలికంగెలుపు ఖాయం! (కామ్రేడ్స్‌ సూర్యం, రవిల అమరత్వం నేపథ్యంలో దుఃఖమే అనంతమై ఆలోచనలు
సాహిత్యం కవిత్వం

నేనెప్పుడూ స్వేచ్చా జీవినే

 నీ హిందూత్వ ఫాసిస్టూ భూగర్భం లో  నన్ను బంధించావనుకోకు సామ్యవాద లావానై  చీల్చుకొని నిన్ను ముంచెత్తుతా జనం నిండా విస్తరిస్తా , నూతన మానవునిగా మళ్ళీ జన్మిస్తా. సోషలిస్టు వెల్లువుగా నీ సామ్రాజ్యవాద సామ్రాజ్యాన్ని ముంచెత్తి మండుతున్న ఎండిపోయిన గుండెలపై తొలకరినై సేదా  బిందువుల నెదజల్లుతా . అడివే కదా అనుకొని కార్పొరేట్ల దాహార్తి కై  ఖాండవ దహనానికి  పూనుకోకు,  ఆదివాసీ దండునై , నిన్నూ,నీ గోబెల్స్ ను సజీవంగా దగ్ధం జేస్తా అవును, నేను కలం పట్టిన కవినే మాత్రమే కాదు, నాగలిపట్టే రైతును,రైతు కూలీని, సహస్ర వృత్తుల కార్మికుణ్ణి, నారినే కాదు, నీ దోపిడీ పై
సాహిత్యం కవిత్వం

నా జీవితం

నా జీవితం, వడ్డించిన విస్తరే కాదనను. కానీ, అన్నార్తుల ఆకలి తీర్చడమే నా ఆరాటం,పోరాటం. కన్నీళ్లు,కడగండ్లు పెద్దగా నేనెరుగ , అయితే. కన్నీళ్లు,కడగండ్లు లేని సమాజమే, నా లక్ష్యం,నా ధ్యేయం. అవును, నేనగ్రవర్ణ సంజాతకున్నే,  కానీ, కుల,వర్గ రహిత సమాజంకై, జరిగే పోరులో నేనూ ఒక సాహితీ సైనికుణ్ణి. నేను పురుషున్నే , నాలోని పురుషాధిక్యతను అనుక్షణం ప్రశ్నించుకుంటూ క్షాళన చేసుకుంటున్న మనిషిని నేను. రేపటి ఉషస్సు విరజిమ్మే అరుణారుణ కాంతులకై , ఆవర్భవించే నూతన మానవునికై , అహర్నిసలు జరుగుతున్న యుద్దానికి భావజాల తూటాలందించే సాంస్కృతిక సైనికుణ్ణి నేను నేను కలాన్నే కాదు, కర్షకున్ని,కార్మికున్ని  దోపిడీ వ్యవస్థను