పరిచయం

No women No History

Introduction to No women No History These notes on ‘History of Indian Women in Movements’ deal mainly with the movements in the 19th and 20th centuries and include the contemporary movements. When we say movements, we mean only those movements which helped the society to move forward. We should be clear about this especially since there are many retrogressive, religious chauvinistic movements in our country. Though the movements mentioned in
సమీక్షలు

చీకటి రోజుల్లో గానాలుండవా…..

 1818 దీర్ఘ కావ్యంపై సామాజిక సాంస్కృతిక విశ్లేషణ శ్రీరామ్‌ పుప్పాల 1818 దీర్ఘ కవిత రాత ప్రతి దశ నుంచి అచ్చు పుస్తకం వరకు ఎన్నోసార్లు చదివాను. ప్రతిసారీ నాకు మరింత లోతైన అర్థం తోచేది. ప్రతి చరణమూ ఒక సంఘటననో, చరిత్రలోని కీలక పరిణామాన్నో గుర్తుచేసేది. మన దేశ ప్రజల పోరాటాలను, హక్కుల హననాన్నీ ఒక క్రమంలో రికార్డు చేసిన రచన ఇది. తనలో తాను మాట్లాడుకుంటూ, మనతో మాట్లాడుతూ భీమానది ఒక విస్మృత చరిత్రను పరిచయం చేస్తున్నది. నదులు నాగరికతా చిహ్నాలు. నదుల వెంట జనావాసాలు ఏర్పడి స్థిర వ్యవసాయం సమకూరే క్రమంలో ఉత్పత్తి సాధనాలు,
సమీక్షలు

ఆకాశ మార్గాన్ని గురి చూస్తున్నవిల్లంబులు

కొండల మీద, గుట్టల మీద, నదుల పక్కన జీవించే దండకారణ్య ఆదివాసులు ఎప్పుడైనా ఇలాంటి పోరాటం చేయాల్సి వస్తుందని కలగని ఉంటారా?  ప్రకృతి పరివ్యాప్త సాంస్కృతిక జగత్తులో ఓలలాడే ఆదివాసులు ఆకాశ యుద్ధాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని అనుకొని ఉంటారా? ఊహా తీరాల వెంట గొప్ప కాల్పనిక భావావేశంతో కళల ఊటను ప్రవహింపచేసే ఆదివాసులు ఇలాంటి ప్రతి వ్యూహ రచన ఎన్నడైనా చేసి ఉంటారా? వందల వేళ ఏళ్ల నుంచి రాజ్య ధిక్కారమే జీవన విధానంగా సాగిన ఆదివాసులు ఆకాశ మార్గాన యుద్ధం చేసే రాజ్యం ఒకటి  తమ మీద ఇలా విరుచుకపడి బాంబుల దాడి చేస్తుందని తలపోసి ఉంటారా?
సమీక్షలు

బహిరంగ ప్రకటనే రాజ్య ధిక్కారం

రాజకీయ, నైతిక, మత, కళా సాహిత్య రంగాలలో ఆనాటికి ప్రబలంగా వుండిన అభి ప్రాయాలను ధిక్కరించేదెవరు? తన అత్మను తాకట్టు పెట్టని వాడే ధిక్కారి కాగలడు.                                                                                                - జార్జి ఆర్వెల్    అతనేదో చెప్పాలనుకుంటున్నాడు. లోపల దాగిన సంవేదనలు, వినిపించాలనిసమాయత్తమవుతున్నాడు .గడ్డకట్టిన మనుషుల మధ్య సమస్త భూగోళాన్ని అరచేతిలో ఇముడ్చుకొని తనలో గూడు కట్టుకున్న అపరిచితతత్వాన్ని వ్యక్తీకరించాలనుకున్నాడు . ఇప్పుడేది రహస్యం కాదు అనే కవిత్వ సంపుటికి కొనసాగింపుగా  బహిరంగ ప్రకటన చేస్తున్నాడు . దేశం వినడానికి సమాయత్తమవుతోంది. మనుషులు తమ దైనందిక జీవితంలో  కిటికీ తెరిసినట్లు అతని కవిత్వాన్ని ఆలకించండి.  నాలిక పొడారిన తర్వాతనయినా సంభాషణ మొదలు
పరిచయం

సహదేవుని రక్త చలన సంగీతం

చాలా కాలం నుండి నేను "రక్త చలన సంగీతం " కామ్రేడ్ రిక్కల సహదేవ రెడ్డి (రిసారె) పుస్తకం కోసం ప్రయత్నాలు చేశాను. నాకు నిరాశే ఎదురైంది. రెండు సంవత్సరాల నా ప్రయత్నంలో మిత్రుడు శివరాత్రి సుధాకర్ సలహాతో నాకు " రక్త చలన సంగీతం" సంకలనం వీక్షణం వేణుగోపాల్ సార్ వద్ద దొరికింది. ఎంతో ప్రేమతో వేణుగోపాల్ సార్ పుస్తకాన్ని అందించారు. ఆ పుస్తకం మిత్రుడు నరేష్ ద్వారా నా చేతి మునివేళ్లు తాకింది. నాకు కామ్రేడ్ రిక్కల సహదేవ రెడ్డి గూర్చి ముందుగా పరిచయం చేసింది మాత్రం కామ్రేడ్ అమర్. నేను అమర్ దగ్గర నుండి
సమీక్షలు

భీమా నది ఘోష 

నేను భీమా నదిని మాట్లాడుతున్నాను! అంటూ 1818 నుండి మొదలైన ప్రస్థానం ఇది. ‘‘చరిత్ర కన్నులోంచి దుఃఖపు చెమ్మనై చిప్పిల్లుతున్నాను మూగబోయిన అలల తీగలపై పురిటి బిడ్డల తొలి ఏడుపునై పెల్లుబుకుతున్నాను..’’ అనే దగ్గరి నుంచి ‘‘అంటరాని కళేబరాన్నై పైకి లేచే దాకా’’, ‘‘రష్యా సేనల పైకి ఉక్రెయిన్లో’’ అంటూ వర్తమానం దాకా! సాగుతుంది.             ‘‘అగాధాల్లో పూడిపోయిన రాచరికాన్ని మళ్ళీ వూరేగిస్తున్న రాచ వీధుల్లోంచి నడచి వస్తున్నా!’’ అని మొదలై ఆనాటి నుంచి ఈనేటి ఏలికల గుట్టు  బయట పెట్టారు. ‘‘పేగు తెంపిన మంత్ర సాని చనుబాలు తాగనివ్వని పసి బాలుడి నోట్లోంచి బొటన వేలినై బయటికి
సమీక్షలు

జైలుగోడలపై రాసిన ప్రశ్నలే..‘‘ప్రేమతో మీ సుధ’’

‘‘ఇక మాటలు అనవసరం, కార్యశూరత్వం చూపాలి. సమాజం కోసం, విప్లవాత్మక దృక్పథంతో రచనలు చేయాలి’’ - శ్రీశ్రీ (8.10.1970 విరసం రాష్ట్ర మహాసభలు-ఖమ్మం) ఇప్పటివరకు అటువంటి మాటలు వింటూనే ఉన్నాం. కార్యశూరత్వం చూపటంలేదు. అసలు ప్రజల పక్షాన నిలబడి మాట్లాడే కవులే పలచబడుతున్నారు. మరి ఎవరు మట్లాడాలి. మాట్లాడుతున్నది అతి తక్కువమందే కావచ్చు..కానీ మాట్లాడుతున్నారు. మాట్లాడకపోతే..ప్రశ్నించకపోతే..గొంతెత్తి రణన్నినాదం చేయకపోతే రాజ్యం చేసే క్రూరత్వం రెట్టింపవుతుంది. ఇవాళ దేశంలో స్త్రీలు, దళితులు ఆర్థిక రాజకీయ దోపిడీలకు గురౌతున్నారు. డెబ్బై ఏళ్ళు దాటిన ముసలిభారతంలో సాంఘిక అణచివేత ఇప్పటికీ కొనసాగుతున్న పరంపరే. ఆర్థికదోపిడీ వల్ల పేదమధ్యతరగతి జీవితాలు దుర్భరమైపోతున్నా ప్రశ్నించకూడదా..? హక్కులకై కలబడకూడదా..? 
సమీక్షలు

ఎరుకల జీవన గాథలు, జాడలు

Literature is a part of the history and it is like  a reservoir of human experiences, emotions and struggle for development.It connects the people, brightens the behaviour and enlighten human aspirations... " పలమనేరు బాలాజీ కథలు జీవితపు అట్టడుగు పొరలనుండి తవ్వి తీసిన పాఠాలు. ఒకానొక ప్రదేశంలో జీవించిన వేర్వేరు మనుషుల పొట్ట నింపుకునే ప్రయత్నంలో ప్రాణం నిలుపుకునే ఆరాటం, వెంటాడుతున్న  బతుకు భయం. ఈ కథలు. కడుపు నిండిన వాళ్ళవి కాదు . కడుపు మండిన  వాళ్ళ వెతలు. రెక్కాడితే కాని డొక్కాడని సామాన్యల  
కొత్త పుస్తకం సమీక్షలు

రంగులన్నీ  సమానమే  యింద్రధనుస్సులో

లింగభేదం యింద్రధనుస్సు లో రంగుల మధ్య భేదం లాంటిది. నేను వొక రంగును కరెక్టు గా గుర్తు పట్టానా లేదా అన్నది అసలు సమస్యే కాదు. అన్ని రంగులకీ సమానమైన విలువ యివ్వడం - ప్రతి రంగుకీ సమాన హోదాలో గుర్తించబడే అవకాశం వుండటం అదీ ముఖ్యమైన విషయం. జన్యుపరంగా, లింగ అభివ్యక్తిపరంగా, లైంగిక గుర్తింపుపరంగా  యే విధమైన లక్షణాలు వున్నప్పటికీ సమానంగా గుర్తించబడే హక్కు ప్రతి వ్యక్తికి వుండాలి. విరసం ప్రచురించిన బిట్టూ కె. ఆర్. రచించిన పి.వరలక్ష్మి గారు అనువదించిన “రెయిన్ బో లైంగిక వైవిధ్యాలు”  పుస్తకాన్ని చూసినప్పుడు “ట్రాన్స్ జెండర్ అనేది కేవలం వొక
సమీక్షలు

“అనగనగా” సినిమా కాదు జీవితం

ఆ రోజు మే 22 సమయం ఐదు గంటల 30 నిమిషాలు. కాలేజీ నుంచి అలసిపోయి ఇంట్లోకి అడుగు పెట్టిన  నన్ను చూసిన మరుక్షణం  ఒక్కసారిగా ఎదురుగా ఉరికి వచ్చి  మాబాబు డింపు (చార్వాక) హత్తుకొని బోరున ఏడ్వటం ప్రారంభించారు.  ఎందుకు ఏడుస్తున్నాడో అర్థం కావడం లేదు. వాడి జీవితంలో అంతగా ఏడ్చింది ఇదే మొదటి సారి కావచ్చు. మొన్న నా ఆరోగ్యం పూర్తిగా క్షీణించి ఇక బ్రతకను అని డాక్టర్ చెప్పిన సందర్భంలో కూడా వాడట్లా ఏడవలేదు. ఇంట్లో ఏం జరిగిందోనని ఆందోళన పడ్డాను. అర్థంకాక ఆలోచిస్తూ, ఎందుకు తనని అట్లా ఏడిపిస్తున్నారని మా పాప ప్రకృతి