కార్మికుల సామూహిక చైతన్యమే “స్ట్రైక్” సినిమా సారాంశం
“ఈనాడు బూర్జువా వర్గానికి ముఖాముఖీగా నిలబడిన వర్గాలన్నిటి లోకీ కార్మిక వర్గం ఒక్కటే నిజమైన విప్లవ వర్గం. తక్కిన వర్గాలు ఆధునిక పరిశ్రమల ప్రభావం వల్ల క్షీణించి, క్షీణించి చివరకు అదృశ్యమవుతాయి. కార్మిక వర్గం ఆధునిక పరిశ్రమల ప్రత్యేక సృష్టి. ఆధునిక పరిశ్రమల అతి ముఖ్య సృష్టి”- మార్క్స్, ఏంగెల్స్-కమ్యూనిస్ట్ మేనిఫెస్టో. 1925 లో సోవియట్ యూనియన్ నుంచి వచ్చిన అద్భుతమైన ఆవిష్కరణ “స్ట్రైక్”. ఈ సినిమా డైరెక్టర్ ప్రపంచ ప్రఖ్యాత సోవియట్ చిత్రనిర్మాత “సెర్గీ మిఖాయ్లోవిచ్ ఐసెన్ స్టీన్”. ప్రపంచ కార్మికులంతా ఏకం కావాలనే సమైక్యవాదం గురించి బలమైన ప్రకటనలు చేసిన రాజకీయ చిత్రం! దీని నిడివి









