కవిత్వం

విత్తనం

బహుశా సృష్టిలో విత్తనమే మొదటి విప్లవానికి నాంది పలికి ఉంటుంది భూమిని చీల్చుకు విత్తనంగా మొలకెత్తడానికి భూమ్మీద పడడానికి శిశువు సైతం గర్భకుహరంలో పెద్దయుద్ధమే చేసి ఉంటది ప్రతిసారీ మట్టి నుండితల్లి నుండి ఆందోళనకారులకు ప్రేమ దొరికే ఉంటుంది ఎందుకంటే ఆందోళన చేయకపోతే నూతన సృష్టి సాధ్యం కాదని మట్టికీ మాతృమూర్తికీ తెలిసే ఉంటుంది **** అశోక్ కుమార్ (హిందీ కవి)అనువాదం: ఉదయమిత్ర
కవిత్వం

పిడికిలి

అడవి గుండెను చీల్చావు మైదానానికి పురిటి నొప్పులొస్తున్నాయి పంటను బూడిద చేశానని విర్రవీగావ్ సకలజనుల కన్నీటి పదునుకు భూపొరల్లోని విత్తనం మొలకెత్తుతుంది చూపుడు వేలు ఎర్రని పోగులతో తాడునేస్తుంది మనురాజ్యపు కుతిక పిసుకుటకై డప్పు ప్రకంపనానికి నియంత గుండె బెదిరింది కొలిమిలో కర్రు ఎర్రబడుతుంది నిరంకుశుడు ఫోబియాతో వణుకుతుండు అమావాస్య ఎల్లకాలముండదు మిరుమిట్లు గొలిపే వెన్నెల రాకపోదు! జై భీమ్ ఇంక్విలాబ్ జిందాబాద్ ఈ దేశ ప్రజల హృదయస్పందనలు తల్లిగర్భంలోనే పిడికిలి బిగించినోళ్ళం మళ్ళోసారి పిడికిలి బిగించుదాం మాతృదేశం కోసం రేపటిస్వప్నం కోసం
కవిత్వం

అర్బన్ నక్సల్

1వడివడిగా...అంగలే వేసానోఒక 'క(౦)గారు' లో .. దూరమే ఎగిరిపడ్డానో..అయినా..చాలా ముందుకే వెళ్ళిపోయానుజీవితం అనేది 'వన్ వే' నో కాదో కానీ..పోరాటానిది మాత్రం ఒక్కటే దారిసాగిల పడిపోయిన నీకోసంనేను.. ఎప్పటికి వెనక్కి రాలేనునా వెనక వెనకే అయినా నువ్వేకదిలి రావాలి... కాని..నీ చెయ్యి పట్టి నేను నడవలేనువెలుగు వెంట సాగే నా నీడ దారినైనానువ్వే నడిచి రావాలి ఎద(ర) పరుచుకున్న రక్త తర్పణ దారి తప్పనీ 'విశాల హృదయం' కానరాదు నాకుఅవును..నా దృష్టిలో ఒక స్పష్టమైన విభజననీ వల్లే కొట్టొచ్చినట్టు కనిపిస్తుందిదప్పిక ఎరగని ఒంటె.. ద్దు పోకడ ఏకాకి ఎడారి ఓడ.. నా ప్రయాణంనీతో కలిసి ఇప్పుడు నేను నడవలేను2నా
కవిత్వం

సుదూరమైన ఆఫ్రికా నుంచి ఓ పెను కేక

అల్లకల్లోలంగా ఉన్న ప్రచండమైన గాలి ఆఫ్రికా కికియులోని పసుపు రంగు గోధుమ పంట నేలను జంతువు చర్మంలా కదిలిస్తోంది.అచ్చం గుంపుల్లో కదిలే ఈగల్లా, పుష్టిగా పెరిగిన ఆఫ్రికా విశాలమైన గడ్డి మైదానాల్లో ఉధృతంగా పారే రక్తపుటేరుల్లా స్వర్గంలో శవాలు చెల్లాచెదురై పడి ఉన్నాయి ~ప్రజలు ఆఫ్రికా గడ్డి మైదానాల్లో జరిగిన ఈ రక్తపాతాలతో ముడిపడి ఉన్నారు! ఈ అభాగ్యుల మరణాల వల్ల లాభ పడేదంతా శవాలను తినే లుకలుక లాడే పురుగులు, రాబందులు మాత్రమే! చూడండి ఎంత నిర్ధయో? అన్ని వైపుల నుంచి "మృతి చెందిన వాళ్ళపై అస్సలు జాలి చూపద్దు" అనే అరుపులు వినిపిస్తున్నాయి!~. ఇక్కడ మృతుల
కవిత్వం

హం హోంగే కామ్యాబ్

వాగ్దానాలు ప్రతి సీజన్ కు పూసే కొత్తపూలువాసనలేని, మనిషి వూసులేని పాలనలునిజమిదన్న వాండ్లను ‘ఇజ’మిదనిలెక్కలుగట్టి జైల్లో మూటగడుతుంటరుపాతచరిత్రను మళ్ళీమళ్ళీ తొడుక్కునే భక్తికాలాన్ని వెనక్కితిప్పి ప్రగతి అనే రక్తిదేశమంటే ప్రజలని మరిచిన ఆయుధంప్రజలబాధలు కంటికి ఆనని రాజ్యంప్రజలు గుమిగూడి మాట్లాడుకుంటరుప్రజలు ప్రజల గురించే మాట్లాడుతుంటరురాజ్యం పాలకుల భోజ్యమన్న పాతసామెతనుతిరిగేసి ప్రజావీరులదే ప్రభుత అంటుంటరుఊర్లల్ల నుంచి పట్నాలదాకబాటవట్టిన కార్పోరేట్లను చర్చిస్తరుఅడ్డందిరిగి గల్లంతయిన అడ్రసులు వెతుకుతుంటరు జంజంబల్ బరీ అని పాటలు పాడుతుంటరుకాని, ఒకటేమిటి వందలసార్లు గుమికూడుతుంటరువొడువని బాధల్ని వొడిసే గొంతులైతుంటరుప్రశ్నిస్తూనే సాగుతుంది ప్రజాయుద్ధంగాయపడ్తూనే... ఎప్పటికప్పుడు సన్నద్ధం
కవిత్వం

దిక్సూచి

కవులు, రచయితలు లేని నేల ఎవరైనా చూడగలరా?ఆలోచనలు అంకురించని ఖాళీ జాగా ఎక్కడైనా ఉందా?మనుషులు కలుసుకోని సమాజాలున్నాయా?అభయహస్తాన్నందించే పాలకుల భయాలేమిటి మరి?ప్రతి విప్లవ కవీ ప్రజలకు ఆప్తుడేవాళ్ళ ప్రతి అక్షరమూ ప్రజల గుండె చప్పుడే!సమాజ దిక్సూచిగా కొన్ని కలాలు కవాతు చేస్తూనే ఉంటాయ్ప్రశ్నల వర్షాలై ప్రజల మెదళ్ళు పరవళ్ళు తొక్కుతూనే ఉంటాయ్...
కవిత్వం

ఆటను ఆపలేని యుద్ధం

శిథిలాల మధ్యఇనుప ధూళితో నిండిన గాలిలోపేలుళ్ల ప్రతిధ్వనులను ఊయల పాటలుగా మార్చుకుంటూఒక చిన్నారి నవ్వింది.ఆ నవ్వుఏ సామ్రాజ్యపు ఫిరంగికీ వినిపించలేదుకానీభూమి గుండెల్లో మాత్రంఒక కొత్త విత్తనంలా మొలిచింది.ఇల్లు లేదుకానీ ఆకాశం ఉంది.బడి లేదుకానీ అక్షరాలను వెతికే కళ్ళు ఉన్నాయి.బొమ్మలు లేవుకానీ రాళ్లతో రాజమందిరాలు కట్టే ఊహ ఉంది.ఊయల విరిగిపోయిందికానీరెండు తాళ్లను మళ్లీ కట్టిగాలిని ఊపే చేతులు ఇంకా ఉన్నాయి.యుద్ధంముందుగా ఇళ్లను చంపుతుంది.తర్వాతఆసుపత్రులను.తర్వాతపాఠశాలలను.చివరికిపిల్లల కలలను.కానీఒక విషయం మాత్రంఅది ఎప్పుడూ పూర్తిగా చంపలేకపోయిందిఆడుకోవాలనే బాల్యం.చూడండి…దుమ్ముతో నిండిన ముఖంపైఇంకా నవ్వు ఉంది.గాయపడిన మోకాలిపైఇంకా పరుగుంది.ఆకలితో వణుకుతున్న శరీరంలోఇంకా స్నేహితుడిని పిలిచే స్వరం ఉంది.అదిమానవ జాతికిచివరి పాఠం.“నన్ను చంపవచ్చునా బాల్యాన్ని కాదు”అనిప్రతి ఊయల చెబుతోంది.శిథిలాలపైఒక
కవిత్వం

ప్రవాహం

నాట్యం నేర్చిన నెమలి ఆటను ఆపదు యే నిర్బంధంరక్తం కారినా రగులుతు మళ్లీ చేస్తుంది పోరాటం పాట నేర్చిన కోయిల రాగం ఆగదు అడ్డొచ్చె కొండకోనలను కోసుకు వెళ్తూ సాగే ఏరే ప్రవాహమవునురణనినాదమై గమ్యం చేరును
కవిత్వం

మనుషులం కదా

మనుషులం కదాఆలోచనలనువిరమించుకోలేం కదాఇంత నాగరికతా పెరిగిందిప్రశ్నలకు జవాబులవెతుకులాటలోనే కదాదేశమంతా పీడిస్తున్నఈ ఉక్కపోతకుకారణాన్ని ప్రశ్నించడంనేరంగా మారుతూందినలుగురు కూడి మాటాడుకోవడం దేశద్రోహమవుతుంది మనుషుల మధ్య వారి మనసుల మధ్య చిచ్చు పెట్టడమే నేటి పాలనా తీరు గోవును పూజిస్తారు మనిషిని ముక్కలుగా నరికీ చంపుతారు మనుషుల మధ్య మనువును అడ్డంగా నిలబెడతారు న్యాయమూర్తులు ధర్మం బోధిస్తారు న్యాయన్ని ఉరితీస్తారు ఈ నిర్భంధ శిబిరంలో మౌనంగా తలదించి బతకడం ప్రజా ద్రోహం మనుషులం కదా మరల నడచి వచ్చిన రహదారి కూడలిలో మరల కలుసుకుందాం!!
కవిత్వం

ఎక్కడివీ స్వేచ్ఛా వాయువులు

వాళ్లు ఈచోటచివరి శ్వాసను విడిచారు ఎన్నడూచూడబోని భవిష్యత్తు కోసం భారీ మూల్యమే చెల్లించారు చేతులకు సంకెళ్లతో ఆగ్ని గుండాల గుండా నడిచారు వాళ్ళు కానీ మాతృభూమి కోసం నిరంతర తపన ఉండేది తుపాకులు కెదురీదారు జైళ్లను ఆహ్వానించారు కానీ ఏనాడు వెనుదీరిగింది లేదు తమ పిల్లల భవిష్యత్తు కోసం త్యాగాలకు వెరిసింది లేదు వాళ్ళ చివరి శ్వాసలకు కాసిన స్వాతంత్ర ఫలాలను మనం అనుభవిస్తున్నాం వాళ్ళు కలలు కన్న జీవితాన్నిమనం జీవిస్తున్నాంతమ రక్తంతోతమ పోరాటంతో తమ బాధలతో తమనష్టాలతో వాళ్లొక జ్వాలను వెలిగించారు ఈ సంకెలా వాళ్లను ఆపలేదు