దండాలు స్వామి
దక్షిణాన పుట్టినవివిక్త కొండల్లో ఏపుగా పెరిగినరాక్ ఫోర్ట్ ఒరిగిపోయిన చెట్టంత మనిషికన్నీళ్ళతో కావేరి నిండిపోయింది చదివిన వేదాంత శాస్త్రంగొల్లుమని ప్రవచనాలను వెదజల్లుతుంది సామాజిక శాస్త్రం ఫిలిప్పీన్స్ నేర్పితేఝార్ఖండ్ క్షేత్రమయ్యింది వనాంచల్ ప్రతి మొక్కవంగి సలాం చేస్తుంది గజరాజులు గజగజ వణుకుతున్నాయిఅండగా నిలిచిన స్వామి లేడని తాను ముందుండి వేసిన ప్రతి అడుగుఆదివాసీ బతుకుల వెలుగు నింప ప్రయత్నం హక్కులకై సంధించిన ప్రశ్నలేతన చావుకి కారణమౌతుంటేపుటల్లోని రాజ్యాంగ ప్రతులుపటపట రాల్చాయి చుక్కలు వణుకుతున్న చేతులుతాగలేని నీరు ఒలుకుతుంటేఓ స్ట్రా ఇవ్వమన్నా ఇవ్వలేని న్యాయం పండు ముదుసలిపార్కిన్సన్ తో జైలు హాస్పిటల్లో..అయినా ఆఖరి శ్వాస దాకాచెదరని ఆదివాసీ స్వప్నంఅమరుడా! దండం!!










