“బూర్జువా ప్రజాస్వామ్యం నుండి కార్పొరేట్ మతరాజ్యం దాకా”
భారతదేశ ప్రస్తుత రాజకీయ, సామాజిక, ఆర్థిక పరిణామాలను రాజ్య స్వభావంలో వస్తున్న ప్రమాదకరమైన మార్పులను అర్థం చేసుకోవాలంటే కేవలం ఉపరితల బూర్జువా ఎన్నికల రాజకీయాలను విశ్లేషిస్తే సరిపోదు. ఈ వ్యవస్థాగత సంక్షోభం వెనుక ఉన్న అసలైన వర్గ ప్రయోజనాలు, దళారీ పెట్టుబడిదారీ కుట్రలను బట్టబయలు చేయాలి. నేడు దేశంలో రాజ్యమేలుతున్న హిందుత్వ శక్తుల ఆధిపత్యాన్ని విడి సంఘటనగానో, కేవలం మతపరమైన ఉన్మాదంగానో చూడకూడదు. భారతదేశం నయా ఉదారవాద సంక్షోభం నుండి ఉద్భవించిన భయంకరమైన 'బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిజం' పిడికిలిలో చిక్కుకుందనే చారిత్రక సత్యం స్పష్టమవుతుంది. ఇది బూర్జువా ప్రజాస్వామ్య వ్యవస్థను లోపలి నుండే నిర్వీర్యం చేస్తూ, రాజ్యాంగ స్వభావాన్ని










